Virat Kohli Anushka Sharma : టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గ్రౌండ్ లోనే కోహ్లీ వీడియో కాల్ లో తన కుటుంబంతో బిజీబిజీగా కనిపించాడు. ముంబైలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ విక్టరీ వేడుకలు ముగిసిన వెంటనే కోహ్లీ తన కుటుంబాన్ని కలిసేందుకు లండన్ వెళ్లాడు.
Virat Kohli Anushka Sharma : టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం మస్తు హ్యాపీగా ఉన్నారు. విరుష్క దంపతులు ఇటీవల తమ రెండో సంతానం అకాయ్‌కి స్వాగతించడం, ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీ20 ప్రపంచ కప్ విజయంతో విరాట్ కోహ్లీతో పాటు వారి కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. అయితే, టీమిండియా విక్టరీ పరేడ్ ముగిసిన వెంటనే కోహ్లి తన కుటుంబంతో కలిసేందుకు వెంటనే లండన్‌కు వెళ్లాడు. మైదానంలో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ వీడియో కాల్‌లో బిజీగా కనిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్ విడిచి శాశ్వతంగా యూకేలో స్థిరపడతారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
నిజంగానే కోహ్లీ లండన్ కు మకాం మార్చనున్నారా? ఈ కొత్త చర్చ ఎందుకువచ్చింది? విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి గత రెండు నెలల్లో లండన్‌లో చాలాసార్లు కనిపించారు. డిసెంబర్ 2023లో కూడా కోహ్లీ తన కుటుంబంతో సమయాన్ని గడపడానికి క్రికెట్ నుండి కాస్త విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో లండన్ లో కనిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి లండన్ వీధుల్లో కనిపించారు. విరుష్క దంపతలు తమ రెండో సంతానం అకాయ్‌కు జన్మనిచ్చినట్లు ప్రకటించిన కొద్ది రోజులకు వీరిద్దరి ఫొటో వైరల్ అయింది.
undefined
'2007ను మర్చిపోలేను కానీ..' టీమిండియా విజయోత్సవ పరేడ్ పై రోహిత్ శర్మ ఏమన్నారంటే..?
విరుష్క దంపతులు తమ రెండో బిడ్డకు లండన్ లోనే జన్మనిచ్చినట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అకాయ్ యూకే ఆసుపత్రిలో జన్మించినట్లు వచ్చిన నివేదికల మధ్య విరాట్ కోహ్లి ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అకాయ్ పుట్టిన కొన్ని రోజుల తర్వాత కూడా లండన్‌లో కనిపించాడు. ఈ సమయంలో లండన్‌లో ఉండి కూతురు వామికతో గడపడం ఆనందంగా ఉందని కోహ్లీ తెలిపాడు. "మేము దేశంలో లేము. కేవలం రెండు నెలల పాటు సాధారణ అనుభూతిని పొందడం.. నాకు, నా కుటుంబానికి ఇది మంచి అనుభవం. వారిలో ఇలాంటి అందమైన క్షణాలను గడిపే అవకాశం రావడం చెప్పలేని అనుభూతిగా" పేర్కొన్నారు. దీంతో రిటైర్మెంట్ తర్వాత విరాట్, అనుష్కలు శాశ్వతంగా లండన్‌కు మకాం మార్చుకుంటారనే వాదనలు తెరమీదకు వచ్చాయి. అయితే, దీనిపై వీరిద్దరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
6, 6, 6... రాహుల్ ద్రవిడ్ బ్యాట్ పవర్ కు ఇంగ్లాండ్ బౌలర్‌కు దిమ్మదిరిగిపోయింది.. !