బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వ‌చ్చింది?

By Mahesh Rajamoni  |  First Published Dec 25, 2023, 10:02 AM IST

What is a Boxing Day Test: చివరిసారిగా బాక్సింగ్ డే టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై పై టెస్ట్ సిరీస్ ను  నెగ్గి చ‌రిత్ర సృష్టించాల‌నుకుంటోంది భార‌త్. అయితే, బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? 
 


IND vs SA Boxing Day Test: డిసెంబర్ 26 నుంచి భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టు గురించి మీరు వినే ఉంటారు. సాధార‌ణంగా జ‌రిగే ఈ టెస్టును బాక్సింగ్ డే టెస్టు అని ఎందుకు అంటున్నారు?  బాక్సింగ్ టే టెస్ట్ అంటే ఏమిటి? సెంచూరియన్ లో భారత్-దక్షిణాఫ్రికా టెస్టును కూడా ఇదే విధంగా ఎందుకు పిలుస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ! 

బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి?

Latest Videos

ఎదైనా ఒక టెస్టు మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్టుగా వర్గీకరించాలంటే  అది డిసెంబర్ 26న ప్రారంభం కావాలి.

బాక్సింగ్ డే టెస్టుకు ఆ పేరు ఎలా వచ్చింది?

'బాక్సింగ్ డే' అనే పదం క్రిస్టియన్ పండుగ క్రిస్మస్ కు సంబంధించినది. ఆనవాయితీ ప్రకారం డిసెంబర్ 25న స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు అందుకుంటారు. మరుసటి రోజు అంటే 26న ఈ బహుమతులు తెరుస్తారు. అందుకే డిసెంబర్ 26న క్రిస్మస్ వేడుకలను నిర్వహించే పురాతన సంప్రదాయం నుంచి వచ్చిన 'బాక్సింగ్ డే టెస్టు'లో క్రికెట్ కూడా ఈ ఆచారంతో ముడిపడి పోయింది.

బాక్సింగ్ డే టెస్టుల చరిత్ర ఇది.. 

ఆస్ట్రేలియాలో 1950-51 యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ టెస్టు మ్యాచ్ డిసెంబర్ 22న ప్రారంభం కాగా, 25వ తేదీ సెలవు దినం. అప్పటి నుంచి బాక్సింగ్ డే టెస్టు క్రికెట్ కు, ఆస్ట్రేలియా వేసవికి పర్యాయపదంగా మారింది. అయితే ఈ రోజు (డిసెంబర్ 26-డిసెంబర్ 30) బాక్సింగ్ డే టెస్టు 1980లో జరిగింది. గత 43 ఏళ్లలో అత్యధిక బాక్సింగ్ డే టెస్టులు ఆస్ట్రేలియాలో, ముఖ్యంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగాయి.

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా.. 

మంగళవారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవని భారత్  సారి మాత్రం చరిత్రను తిరగరాయాలనుకుంటోంది. ఎలాగైనా టెస్టు సిరీస్ ను గెలవాలనుకుంటోంది.

click me!