Shubman Gill: సెల్ఫీ విత్ లయన్.. ఇంత సాహసం అవసరమా బ్రో?

By Rajesh Karampoori  |  First Published Dec 24, 2023, 9:20 PM IST

Shubman Gill: టీమ్ ఇండియా రైజింగ్ స్టార్ శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ కు దొరికిన కాస్త విరామ సమయాన్ని తన టీమ్ మెట్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన సహచరులతో కలిసి జంగిల్ సఫారీకి వెళ్లినట్టు తెలుస్తుంది.  ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఓ ఫోటో మాత్రం చాలా స్పెషల్. ఎందుకంత స్ఫెషల్.. ఆ ఫోటో ఎందుకు వైరలవుతుందో మీరు కూడా ఓ లూక్కేయండి.  


Shubman Gill: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌ను 1-1 తో సమం చేసి.. అనంతరం ఆడిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై అధిపత్యం చేలాయించి.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే.. ఇప్పడూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో  రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌ను భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఎలాగైనా ఈ సిరీస్ ను.. సరికొత్త చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ తరుణంలో సెంచూరియన్‌లోని సూపర్ ‌స్పోర్ట్ పార్క్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ లోని తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టు కేప్‌టౌన్‌లో జనవరి 03న మొదలవుతుంది. అయితే.. తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆట జరగడం కష్టంగానే ఉంది.  

ఇదిలా ఉంటే.. కొందరు టీమిండియా ప్లేయర్లు దక్షిణాఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ప్రత్యేక ప్రదేశాల సందర్శిస్తూ రిప్రెష్ అవుతున్నారు. ఇందులో భాగంగా టీమ్ ఇండియా రైజింగ్ స్టార్ శుభ్‌మాన్ తన సహాచరులతో కలిసి ఫారెస్ట్ సఫారీకి వెళ్లాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు టీమిండియా సిబ్బంది రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథూర్, టీ దిలీప్ కూడా జంగిల్ సఫారీకి వెళ్లారు.వారందరూ ఖడ్గమృగంతో కలిసి ఫొటోకు ఫోజులు ఇచ్చారు. వాటిపై సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలను టీమిండియా ప్లేయర్లు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అవి వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

ఈ చిత్రాలలో ఒక ఫోటో మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఆ ఫోటో నెట్టింట్లో తెగవైరల్ అవుతుంది. ఈ ఫోటో లో క్రికెటర్ గిల్.. సఫారీ జీప్ లో కూర్చుని ఉండగా.. అతని వెనుక కొంచెం దూరంలో ఓ సింహం కూర్చొని ఉంది. ఈ సింహంను చూపిస్తూ.. ఓ గిల్ ఓ సెల్పీ ఫోటోను దిగాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ IPL ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ఈ ఫోటోపై స్పందిస్తూ, "లయన్ హార్ట్" అని కామెంట్ చేసింది. ఇక నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సెల్ఫీ విత్ లయన్, సింహంతో మరో సింహం, టీమిండియా ఓపెనర్లు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరూ నెట్టిజన్లు మాత్రం .. ఇలాంటి సాహసాలు అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

డిసెంబర్ 26న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ సెంచూరియన్‌లో జరగనుండగా, రెండో టెస్టు జనవరి 3-7 మధ్య కేప్‌టౌన్‌లో జరగనుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు కూడా జరిగాయి. టీ20 సిరీస్ 1-1తో డ్రాగా ముగియగా, కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో భారత్ 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Safari time for Shubman Gill 🐊🐅🐆🐃🦒🚘

📸: Shubman Gill pic.twitter.com/0oLOsL3rnB

— CricTracker (@Cricketracker)
click me!