ఫైన‌ల్లో విరాట్ కోహ్లీ సూప‌ర్ ఇన్నింగ్స్.. లేక‌పోతే టీమిండియా సంగ‌తి అంతే.. !

By Mahesh Rajamoni  |  First Published Jun 29, 2024, 10:53 PM IST

IND vs SA T20 World Cup 2024 final : భారత్-దక్షిణాఫ్రికా జట్లు 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్ ఆడుతున్నాయి. టీమిండియా రెండవ టీ20 ప్రపంచ కప్ టైటిల్ పై క‌న్నేయ‌గా, సౌతాఫ్రికా తొలిసారి ఛాంపియ‌న్ గా నిలవాల‌నుకుంటోంది. ఈ మ్యాచ్ లో క‌ష్ట స‌మ‌యంలో విరాట్ కోహ్లీ, అక్ష‌ర్ ప‌టేల్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టారు. 


IND vs SA T20 World Cup 2024 final : కోట్లాది మంది క్రికెట్ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 ఫైన‌ల్ రోజు వచ్చేసింది. తుది పోరులో దక్షిణాఫ్రికా-భారత జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇరు జ‌ట్లు ఫైన‌ల్ కు చేరుకున్నాయి. దీంతో ఫైన‌ల్ మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది. ఫైన‌ల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పులు చేయలేదు. అదే జట్టుతో దక్షిణాఫ్రికా కూడా బరిలోకి దిగింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ భార‌త ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే, రోహిత్ శ‌ర్మ బ్యాట్ ఫైన‌ల్లో ప‌నిచేయ‌లేదు. ఆరంభంలోనే భార‌త్ కు రోహిత్ శ‌ర్మ వికెట్ రూపంలో బిగ్ షాక్ త‌గిలింది. రెండో ఓవర్ నాలుగో బంతికి భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. హెన్రిచ్ క్లాసెన్ చేతిలో రోహిత్ శర్మ క్యాచ్ గా ఔట్ అయ్యాడు. 5 బంతుల్లో 9 పరుగులు చేసి రోహిత్ పెవిలియ‌న్ కు చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి రిషబ్ పంత్ కూడా డ‌కౌడ్ అయ్యాడు. దీంతో భారత్ 2 ఓవర్లలో 2 వికెట్లకు 23 పరుగులతో ఉండ‌గా, సూర్యకుమార్ యాదవ్ రూపంలో భారత్‌కు మూడో దెబ్బ తగిలింది. ఐదో ఓవర్ మూడో బంతికి కగిసో రబాడ సూర్యాను అవుట్ చేశాడు. 4 బంతుల్లో 3 పరుగులు పెవిలియ‌న్ కు చేరాడు.

Latest Videos

undefined

5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులతో క‌ష్టాల్లో ప‌డింది భార‌త జ‌ట్టు. ఈ స‌మ‌యంలో విరాట్ కోహ్లీ, అక్ష‌ర్ ప‌టేల్ లు భార‌త ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. వికెట్లు ప‌డ‌కుండా కింగ్ కోహ్లీ నెమ్మ‌దిగా ఆడుతుండ‌గా, మ‌రో ఎండ్ లో అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అక్ష‌ర్ ప‌టేల్ సిక్స‌ర్ల‌తో దుమ్మురేపాడు. నాలుగు సిక్స‌ర్ల‌తో 47 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడిన అక్ష‌ర్ ప‌టేల్ ర‌నౌట్ కావ‌డంతో మూడు ప‌రుగులు దూరంలో హాఫ్ సెంచ‌రీ కోల్పోయాడు. అయితే, విరాట్ కోహ్లీ నెమ్మ‌దిగా ఆడుతూనే త‌న హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ పూర్తి చేశాడు. వీరిద్ద‌రు క‌లిసి అప్ప‌టికే టీమిండియా స్కోర్ బోర్డును సెంచ‌రీ దాటించారు.

ఈ వరల్డ్ కప్ లో పేలవ ఆటను కొనసాగించిన కింగ్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కోహ్లీ ఆ తర్వాత దూకుడు పెంచాడు. 128.8 స్ట్రైక్ రేటుతో 76 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్ లో 2 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. దీంతో భారత్ సౌతాఫ్రికా ఛాలెంజింగ్ టార్గెట్ ను అందించింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కీలకమైన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ వికెట్లు పడిన తర్వాత తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత ఫోర్ బోర్డులో కీలకంగా ఉంది. ఈ మ్యాచ్లో శివం దుబాయ్ 27 పరుగులతో చివర్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హార్థిక్ పాండ్యా 5* అజయంగా నిలవగా, రవీంద్ర జడేజా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

click me!