T20 World Cup 2024 : రోహిత్ శర్మ కెప్టెన్ కాదు గొప్ప లీడర్.. టీమిండియా కెప్టెన్ పై ప్రశంసల జల్లు

By Mahesh Rajamoni  |  First Published Jun 29, 2024, 7:07 PM IST

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో భారత జట్టు సౌత్ ఆఫ్రికా తో తలపడుతోంది.  ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 
 


T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భార‌త జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ కు చేరుకుంది. తుదిపోరులో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. అయితే, త‌న‌దైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో జ‌ట్టును ముందుకు నడిపిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా 2024 టీ20 ప్రపంచ కప్ లో భార‌త్ ను ముందుకు న‌డిపించిన తీరును ప్ర‌స్తావిస్తూ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో ఫైన‌ల్ మ్యాచ్ కు ముందు గొప్ప విశ్వాసాన్ని నింపాడు. 

మొత్తం ఈ మెగా టోర్నమెంట్‌లో అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసిన తర్వాత, ఐసిసి ట్రోఫీని కైవసం చేసుకోవాలనే తమ చిరకాల లక్ష్యాన్ని చేరుకోవడంపై భారత్ దృష్టి పెట్టాలని చావ్లా అభిప్రాయపడ్డాడు. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ను సెమీ ఫైన‌ల్ లో ఓడించిన‌ భార‌త్ ఇప్పుడు ప్రోటీస్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. భారత ఓపెనింగ్ స్టాండ్ నుండి రోహిత్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో పాటు ఈ టీ20 ప్రపంచ కప్ అంతటా భారత్ ను నిలకడగా ముందుకు న‌డుపుతున్నాడు హిట్ మ్యాన్. ఐసీసీ ట్రోఫీ కోసం 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను ఈ ప్ర‌పంచ క‌ప్ తో ముంగింపు ప‌లికి ట్రోఫీని అందుకోవాల‌ని భార‌త్ చూస్తోంది.

Latest Videos

IND vs SA Final: ఫైనల్‌కు ముందు టీమిండియా షాకింగ్ నిర్ణయం..

అయితే ఐడెన్ మార్క్‌రామ్ నేతృత్వంలోని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు కూడా చాలా బ‌లంగా క‌నిపిస్తోంది. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో విజయం సాధించి ఫైన‌ల్ కు చేరుకుంది. దీంతో ఫైన‌ల్ మ్యాచ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌టం ప‌క్కా. 2023 ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై, 2022 టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్‌పై ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్న రోహిత్.. ఇప్పుడు ఫైన‌ల్లో ప్రోటీస్ జ‌ట్టును ఓడించి ఛాంపియ‌న్ గా నిల‌వాల‌ని చూస్తోంది.

స్టార్ స్పోర్ట్స్‌తో పియూష్ చావ్లా మాట్లాడుతూ.. రోహిత్ నాయకత్వ లక్షణాలను కొనియాడాడు. ఈ టీ20 ప్రపంచ కప్ లో భార‌త్ ను న‌డింపించిన తీరు, బ్యాట‌ర్ గా అద‌ర‌గొట్టిన ప్లేయ‌ర్ గా నిల‌వ‌డంపై ప్ర‌శంస‌లు కురిపించాడు. "రోహిత్ ఎలా ఉదాహరణగా నిలిచాడో, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అతను కెప్టెన్ మాత్ర‌మే కాదు.. గొప్ప నాయ‌కుడు. ఒక నాయకుడు మాట‌లతో పాటు చేతల్లో చూపిస్తే దానిని మిగిలినవారు ఫాలో అవుతారు.. ఇప్పుడున్న భారత జట్టులో అదే జరుగుతోంది" అని చావ్లా అన్నారు.

23 ఫోర్లు, 8 సిక్సర్లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన భార‌త క్రికెట‌ర్ షఫాలీ వర్మ

click me!