T20 World Cup 2024 prize money : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ పోరులో జూన్ 29న భారత్ తో దక్షిణాఫ్రికా తలపడుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే, ఫైనల్ చేరిన ఈ రెండు జట్లతో పాటు ఇతర టీమ్ లు ఎంత మొత్తం డబ్బును అందుకుంటాయి? అసలు టీ20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీ ఎంత?
IND vs SA, T20 World Cup 2024 prize money: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ కు చేరుకుంది. ఈ మెగా టోర్నీ చివరి మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. గతంలోని ఛాంపియన్ జట్లకు అనూహ్యంగా టోర్నీ నుంచి ఔట్ అయ్యాయి. ఫైనల్ లో ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా సరికొత్త చరిత్ర కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో నగదును కూడా ప్రకటించింది. దీంతో ఫైనల్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిచిన జట్టుతో పాటు రన్నరఫ్, సహా ఇతర జట్లు ఏంత మొత్తం డబ్బును అందుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు మీకోసం..
భారత్-దక్షిణాఫ్రికా 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్ ఆడుతున్నాయి. టీమిండియా రెండవ టీ20 ప్రపంచ కప్ టైటిల్ కోసం ఆడుతుండగా, దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ టోర్నీకి రికార్డు స్థాయిలో బహుమతిని ప్రకటించింది. ఈ భారీ ప్రైజ్ మనీ ప్రపంచంలో క్రికెట్‌కు పెరుగుతున్న ప్రజాదరణను గుర్తు చేస్తుంది, ఇది మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రపంచ కప్‌ను నిర్వహించడం ద్వారా ఐసీసీ ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024 మొత్తం ప్రైజ్ పూల్ $11.25 మిలియన్లు (భారత కరెన్సీలో 93.51 కోట్ల రూపాయలు). ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అత్యధికం. ఈ మెగా టోర్నీలో ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు $2.45 మిలియన్లు (రూ. 20.40 కోట్లు) అందుకుంటుంది. అలాగే, అదనపు బోనస్ లు కూడా ఉంటాయి.
undefined
టీ20 ప్రపంచ కప్ 2024 లో వివిధ జట్లు అందుకునే ప్రైజ్ మనీ వివరాలు..
విజేత - రూ. 20.40 కోట్లు
రన్నరప్ - రూ. 10.67 కోట్లు
ఓడిన సెమీఫైనలిస్టులు- రూ.6.48 కోట్లు
సూపర్ 8 జట్లు - రూ. 3.16 కోట్లు
9-12వ స్థానంలో ఉన్న జట్లు - రూ. 2 కోట్లు
13-20వ స్థానంలో ఉన్న జట్లు - రూ. 1.87 కోట్లు
ఒక్కో మ్యాచ్ గెలిచినందుకు బోనస్ - రూ. 26 లక్షలు
T20 WORLD CUP 2024 : రోహిత్ శర్మ కెప్టెన్ కాదు గొప్ప లీడర్.. టీమిండియా కెప్టెన్ పై ప్రశంసల జల్లు