IND vs ENG: పెద్ద‌లోటే కానీ వ్యక్తిగ‌త జీవీత‌మే ముందు.. ! విరాట్ కోహ్లీపై నాజర్ హుస్సేన్ కామెంట్స్ వైర‌ల్

By Mahesh Rajamoni  |  First Published Feb 8, 2024, 4:17 PM IST

Virat Kohli: ఇంగ్లాండ్ క్రికెట‌ర్ నాజర్ హుస్సేన్ భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. టీమిండియాకు కోహ్లీ అందించిన సేవ‌ల‌ను కొనియాడుతూ.. అలాంటి బ్యాట్స్‌మెన్ లేకపోవడం ఏ జట్టుకు అయినా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాడు.
 


Virat Kohli: భారత స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో జ‌రిగిన తొలి రెండు టెస్టుల‌కు అందుబాటులో లేడు. ప్ర‌స్తుత‌ మీడియా కథనాల ప్రకారం, కోహ్లీ రాబోయే రెండు మ్యాచ్‌ల‌కు కూడా దూరం కానున్నాడు.  చివ‌రి మ్యాచ్ కూడా ఆడ‌తాడా లేదా అనేది చూడాలి. ఈ క్ర‌మంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. కోహ్లీకి మద్దతు తెలుపుతూ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాల‌ని నొక్కి చెప్పాడు.

టీమిండియాకు విరాట్ కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు అందించిన సేవ‌ల‌ను నాసిర్ హుస్సేన్ ప్రశంసించాడు. అలాంటి బ్యాట్స్‌మెన్ లేకపోవడం ఏ జట్టుకు అయినా ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బేన‌ని పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లి క్రికెట్ లో  ఎలాంటి సిరీస్ ఆడిన ప్లేయ‌ర్ల‌లో.. అన్ని కాలాలలోనూ గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. ప్రతి జట్టు కోహ్లీ వంటి ఆటగాడిని కోరుకుంటుంది. కోహ్లీ 15 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడుతున్నాడు. అత‌నికి కూడా వ్య‌క్తిగ‌త జీవితం ఉంటుంది. కొంత కాలం పాటు అతని కుటుంబంతో కలిసి ఉండటానికి ఆట నుండి విరామం అవసరమైతే, విరాట్ కోహ్లీకి మ‌ద్దుతు ఇస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము" అని పేర్కొన్నాడు.

Latest Videos

కుర్చీని మ‌డ‌త‌పెట్టి.. విరాట్ కోహ్లీ-అనుష్క‌ల డాన్స్ అదిరిపోయిందిగా.. ! వీడియో

ఒకవేళ కోహ్లీ వచ్చే రెండు మ్యాచ్‌ల్లో ఆడకపోతే అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీమ్ ఇండియాకు అవసరం. కోహ్లి స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినప్పటికీ, గత మ్యాచ్‌లో అతను ప్రభావం చూపలేకపోయాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్‌గా ఉంటే అతను భారత బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేస్తాడ‌ని నాసిర్ హుస్సేన్ అన్నాడు. అలాగే, కోహ్లీ-అతని కుటుంబం, అతని వ్యక్తిగత జీవితం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాడు. విరాట్ లేక‌పోవ‌డం భారత్‌కు దెబ్బ కావచ్చు, కానీ చాలా మంది యంగ్ ప్లేయ‌ర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ లేక‌పోతే.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించే అవకాశం కూడా భార‌త్ కు ఉంద‌ని తెలిపాడు. కాగా, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు జరగనుంది.

ఇట్ల చేస్తున్న‌వేంది ఇషాన్ కిష‌న్.. జ‌ట్టులోకి రావ‌ద్ద‌నుకుంటున్నావా ఏందీ.. !

click me!