Latest Videos

విరాట్ భాయ్ మ‌స్తు హ్యాపీ.. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయ‌ర్లు.. వీడియో

By Mahesh RajamoniFirst Published Jun 17, 2024, 7:11 PM IST
Highlights

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024 సూప‌ర్-8లో ప్లేయింగ్ 11 గురించి హాట్ హాట్ గా చ‌ర్చలు జ‌రుగుతున్న స‌మ‌యంలో భార‌త ప్లేయ‌ర్లు అవేమీ ప‌ట్టించుకోకుండా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఫ్లాప్ షోతో అందరికి టెన్షన్ పెంచిన కోహ్లీ భాయ్ అయితే మ‌స్తు హ్యాపీగా క‌నిపించాడు.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో అస‌లైన స‌మ‌రం బుధ‌వారం నుంచి షురూ కానుంది. ఎందుకంటే లీగ్ ద‌శ‌లో 20 టీమ్స్ పోటీ ప‌డ‌గా, ఇప్పుడు అందులోంచి వ‌చ్చిన కేవ‌లం 8 బలమైన టీమ్స్ సూపర్-8లోకి వ‌చ్చాయి. లీగ్ ద‌శ‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా సూప‌ర్-8కు చేరుకుంది. ప్రస్తుతం సూప‌ర్-8 రౌండ్ లో భార‌త జ‌ట్టు ప్లేయింగ్ 11 గురించి ప్రతిచోటా హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆటగాళ్లు ఈవేమీ ప‌ట్టించుకోకుండా త‌మ‌కు దొరికిన స‌మ‌యాన్ని ఎంజ‌య్ చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ఫ్లాప్ షో తో అందరికి టెన్షన్ పెంచిన విరాట్ కోహ్లీ మ‌స్తు హ్యాపీగా క‌నిపించిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

నాకౌట్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ భాయ్ ఎలాంటి టెన్షన్ లేకుండా బీచ్‌లో టీమిండియా ప్లేయ‌ర్ల‌తో కలిసి బీచ్ లో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ఇంకా ప్లేయింగ్ 11లో అవకాశం రాని ప్లేయ‌ర్లు కూడా బీచ్ వాలీబాల్ ఆడుతూ ఎంజ‌య్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాల‌ను భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) త‌న సోష‌ల్ మీడియా హ్యాడింల్ లో ఈ వీడియోను షేర్ చేసింది. ఇందులో దాదాపు టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ బీచ్ లో సంద‌డి చేస్తూ క‌నిపించారు. వీడియోలో ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ కూడా ఉన్నార‌ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది బీసీసీఐ. ఈ వీడియోలో శివమ్ దూబే, రింకూ సింగ్, జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్‌తో సహా పలువురు ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ను అద్భుతంగా ఆడుతున్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

 

📍 Barbados

Unwinding at the beach 🌊, the way! pic.twitter.com/4GGHh0tAqg

— BCCI (@BCCI)

 

సూప‌ర్-8లో జూన్ 20న తొలి మ్యాచ్ ఆడ‌నున్న భార‌త్

టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 మ్యాచ్‌లు జూన్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రౌండ్ లో జూన్ 20న ఆఫ్ఘనిస్థాన్‌తో భార‌త జ‌ట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో మార్పులు చేసే అవ‌కాశ‌ముంది. స్పిన్నర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వెస్టిండీస్‌లో సూపర్-8 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాబ‌ట్టి హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. దీని కోసం కొంద‌రిని తుదిజ‌ట్టు నుంచి త‌ప్పించే అవ‌కాశ‌ముంది.

అంద‌రి కళ్లు విరాట్‌పైనే.. 

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి లీగ్ ద‌శ మ్యాచ్‌లలో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ఓపెనింగ్ రోల్ వ‌చ్చిన ర‌న్ మెషిన్ ఇప్ప‌టివ‌ర‌కు రెండంకెల స్కోర్ ను కూడా అందుకోలేక‌పోయాడు. కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 4, 1, 0 స్కోరుతో ఫ్లాప్ షో తో అందరినీ నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కోహ్లీ గణాంకాలు అద్భుతంగా ఉండడంతో ఇప్పుడు అందరి చూపు కింగ్ కోహ్లీ పైనే ఉన్నాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శ‌ర్మ‌ను అన్‌ఫాలో చేయ‌డం పై శుభ్‌మన్ గిల్ రియాక్ష‌న్ ఇదే..

click me!