Latest Videos

ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శ‌ర్మ‌ను అన్‌ఫాలో చేసిన శుభ్‌మన్ గిల్.. ఎందుకు?

By Mahesh RajamoniFirst Published Jun 16, 2024, 10:13 AM IST
Highlights

Shubman Gill unfollows Rohit Sharma : శుభ్‌మన్ గిల్- భార‌త‌ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఏం జ‌రుగుతుందో ఏమో తెలియ‌దు కానీ, ఇద్ద‌రి మధ్య చోటుచేసుకుంటున్న ప‌రిస్థితులు ఆందోళ‌నక‌రంగా ఉన్నాయి. ఇద్ద‌రిమ‌ధ్య మాట‌ల‌యుద్ధం వార్తల మ‌ధ్య గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మను అన్‌ఫాలో చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.
 

Shubman Gill unfollows Rohit Sharma : భారత క్రికెట్ జట్టులో అత్యంత ప్రతిభావంతులైన యంగ్ ప్లేయ‌ర్ల‌లో శుభ్‌మన్ గిల్ ఒకరు. టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో త‌ప్ప‌కుండా చోటుద‌క్కుతుంద‌ని భావించారు కానీ, ఈ 24 ఏళ్ల క్రికెటర్ ను టీ20 ప్రపంచ కప్ స్టాండ్‌బై జట్టు కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. దీంతో జట్టుతో పాటు యూఎస్ఏకు కూడా వెళ్లాడు. అత‌నితో పాటు రింకూ సింగ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు కూడా రిజ‌ర్వు ప్లేయ‌ర్లుగా ఉన్నారు. కానీ ఇతరుల మాదిరిగా కాకుండా, గిల్ ఎప్పుడూ మైదానంలో కనిపించలేదు. ప్ర‌స్తుతం గిల్-మేనేజ్‌మెంట్-రోహిత్ శర్మల మధ్య అంతా బాగాలేదని తెలుస్తోంది.

రోహిత్ శర్మను అన్‌ఫాలో చేసిన శుభ్‌మన్ గిల్

ఇలాంటి వార్త‌ల మ‌ధ్య శుభమన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో  రోహిత్ శర్మను అన్‌ఫాలో చేయడం అందరిని షాక్ కు గురిచేసింది. వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి.. ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడ‌నేది హాట్ టాపిక్ గా మారింది. చాలా ప్రశ్నలను లేవనెత్తింది. అంతేకాకుండా, క్రమశిక్షణా సమస్యల కారణంగా, జట్టు నుండి తిరిగి ఇండియాకు పంపించిన త‌ర్వాత శుభ్‌మన్ గిల్‌ను  రోహిత్ ను అన్‌ఫాలో చేశాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల్లో బిజీగా ఉంటూ జ‌ట్టుకు స‌హ‌క‌రించ‌డం లేద‌నే ఆరోప‌ణ‌ల మ‌ధ్య గిల్ ను జ‌ట్టు నుంచి త‌ప్పించి ఇండియాకు పంపించారు. అలాగే, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, గిల్ ఇండియాకు రాగా, రింకూ సింగ్ మాత్రం జ‌ట్టుతో అమెరికాలోనే ఉన్నాడు.

అయితే క్రమశిక్షణా సమస్యల కారణంగా గిల్ త్వరగా నిష్క్రమించలేదని యువ బ్యాట్స్ మన్ సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. మిగిలిన టోర్నమెంట్ కు బ్యాకప్ ఓపెనర్ అవసరం జట్టు మేనేజ్ మెంట్ కు లేదనీ, అందుకే శుభ్ మన్ ను తప్పించామని తెలిపాడు. అయితే, జట్టుకు మద్దతుగా ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, రింకూ సింగ్ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఉండగా, శుభ్‌మన్ గిల్ గైర్హాజరు కావడం గమనార్హం. అలాగే, అమెరికాలో బిజినెస్ ప‌నుల‌ను చూసుకుంటూ జ‌ట్టుతో ఉండ‌క‌పోవ‌డంతో గిల్ ను త‌ప్పించిన‌ట్టు కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఈ ముగ్గురు భారత ప్లేయ‌ర్లు టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 మ్యాచ్‌లు ఆడ‌టం క‌ష్ట‌మే..

click me!