Latest Videos

విరాట్ కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయ‌ర్.. అత‌నికి తెలుసు ఏలా ఆడాలో.. !

By Mahesh RajamoniFirst Published Jun 19, 2024, 9:31 PM IST
Highlights

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో సూపర్-8 దశలో తిరిగి ఫామ్‌లోకి వ‌స్తాడ‌ని విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతుగా నిలిచాడు. మెగా టోర్నీలో తొలి 3 మ్యాచ్‌ల్లో కోహ్లీ కేవలం 5 పరుగులే చేశాడు. సూపర్-8లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. 
 

Virat Kohli is the biggest match player: టీ20 వరల్డ్ కప్ 2024 సూప‌ర్-8లో టీమిండియా త‌న తొలి మ్యాచ్ ను జూన్ 20 (గురువారం) ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడ‌నుంది. వ‌రుస హ్యాట్రిక్ విజ‌యాల‌తో టీమిండియా సూప‌ర్-8కు చేరుకుంది. కానీ, మెగా టోర్నమెంట్ గ్రూప్ దశలో న్యూయార్క్ పిచ్ ల‌పై టీమిండియా బ్యాట‌ర్లు పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌క‌పోవ‌డం జ‌ట్టు బ్యాటింగ్ ఫామ్‌పై కొంచెం ఆందోళనను పెంచింది. మ‌రీ ముఖ్యంగా టీమిండియా స్టార్ ప్లేయ‌ర్, ఓపెనర్ విరాట్ కోహ్లీ లీగ్ ద‌శ‌లో ఆడిన‌ మూడు మ్యాచ్‌ల్లో మూడుసార్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు. అయితే, కోహ్లీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. సూప‌ర్-8 మ్యాచ్ ల‌లో కింగ్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వ‌స్తాడ‌ని పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయ‌ర్ అని పేర్కొంటూ అత‌నికి ఎలా ఆడాలో తెలుసున‌ని చెప్పాడు. సూప‌ర్-8లో భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌లో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, కోహ్లీ పెద్ద మ్యాచ్ ప్లేయర్ అనీ, ముఖ్యమైన మ్యాచ్ ల‌లో తప్పకుండా మంచి ఇన్నింగ్స్ తో అడుగుపెడతాడని చెప్పాడు. మెగా టోర్నమెంట్ గ్రూప్ దశ అంతటా కోహ్లీ చాలా దూకుడుగా క‌నిపించాడు కానీ, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారీ షాట్లు ఆడ‌బోయే ఔట్ అయ్యాడు. కానీ, అభిమానులు ఇప్పుడు ఐపీఎల్ 2024 లో ఆడిన ఆట‌ను కోరుకుంటున్నారు.

T20 World Cup 2024 సూప‌ర్-8 మ్యాచ్‌లకు ముందు టీమిండియాకు బిగ్ షాక్..

"పెద్ద మ్యాచ్‌లలో ఎలా నిలబడాలో కోహ్లీ తెలుసు కాదా? అదే అతన్ని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది. అతను ఒక స్పెష‌ల్ ప్లేయ‌ర్.. అతను తన చేతిని పైకి లేపి ఓకే చెప్పబోతున్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. తిరిగి ఫామ్ లోకి రాబోతున్నాడు. మ‌రీ ముఖ్యంగా పెద్ద మ్యాచ్ ల‌లో విరాట్ కోహ్లి సూప‌ర్ ప్రదర్శనను ఎప్పుడూ చూస్తూనే ఉంటాము.. అతను ఖచ్చితంగా అలాంటి షాట్‌లను ఆడ‌తాడు.. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి...  మ‌ళ్లీ మీరు విరాట్ కోహ్లీ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ రుచిని చూస్తారు" అని ఇర్ఫాన్ ప‌ఠాన్ అన్నాడు.

ఆఫ్ఘనిస్థాన్ పై భార‌త్ పైచేయి సాధించాలంటే ఆ జ‌ట్టు స్పిన్ మాయాజాలాన్ని ఎదుర్కొని నిల‌బ‌డాలి. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీలు భార‌త జ‌ట్టుకు బ‌ల‌మైన పోటీని ఇవ్వ‌గ‌ల‌రు. అమెరికాలో ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డ్డ భార‌త ప్లేయ‌ర్లు ఇప్పుడు వెస్టిండీస్ లో మ్యాచుల‌ను ఆడ‌నున్నారు. అమెరికాతో పోలిస్తే ఇక్క‌డి పిచ్ లు చాలా భిన్నింగా ఉంటాయి. స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంటాయి. స్పిన్ ను ఎదుర్కొంటే ప‌రుగుల వ‌ర‌దపారుతుంది. చూడాలి రోహిత్, కోహ్లీలు ఓపెనింగ్ తో ఎలా రాణిస్తారో.. !

టీ20 ప్రపంచకప్‌లో దంచికొట్టారు.. రికార్డుల మోత మోగించారు..

click me!