IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరుగులు చేయడానికి విరాట్ కోహ్లీ ఇబ్బందిపడుతున్నాడు. ఈ సిరీస్ మొత్తంగా అతని నుంచి ఆశించిన ఇన్నింగ్స్ లు రాలేదు. దీంతో ఆసీస్ తో పాటు భారత అభిమానులకు, మాజీ క్రికెటర్లకు కింగ్ కోహ్లీ టార్గెట్ గా మారాడు.
IND vs AUS: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో ప్రేక్షకులు భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. అతని పట్ల దురుసుగా ప్రవర్తించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ను ఆడుతున్నాయి. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఐదో టెస్టు తొలిరోజు మ్యాచ్ సందర్భంగా సిడ్నీ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు విరాట్ కోహ్లీ అభిమానులకు కోపం తెప్పించారు.
శుక్రవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కేకలు వేయడం ప్రారంభించారు. కోహ్లీని వెక్కిరించేలా అరుస్తూ అతనికి స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్రేక్షకుల మధ్య ప్రేమ-ద్వేషపూరిత సంబంధం ఎప్పుడూ ఉంటుంది. కానీ, ఇక్కడ మితిమీరింది.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి రాగానే, సిడ్నీ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అతనిని ఆటపట్టిస్తూ,కేకలు వేయడం ప్రారంభించారు. మరోవైపు భారత అభిమానులు కూాడా కోహ్లీ కోహ్లీ అంటూ గ్రౌండ్ ను హోరెత్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీని ప్రేక్షకులు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.
Loud boos ring around the SCG, as Virat Kohli walks in, for the final time at this famous ground. pic.twitter.com/bvCtIDStI8
— Vijay A (@VAAChandran)
Virat Kohli's grand entry into the stadium, the whole stadium stood up and chanted "Kohli Kohli."!!🔥
Best best feelings ❤️❤️❤️🤩 pic.twitter.com/Hh1gMSVplt
సిడ్నీలోనూ నిరాశపర్చిన విరాట్ కోహ్లీ
ఇదిలావుండగా, సిడ్నీలో భారత మరోసారి తక్కువ పరుగులకే కుప్పకూలింది. అదరగొడుతాడనుకున్న విరాట్ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 17 పరుగులకే ఔటయ్యాడు. ఈ సమయంలో ఈ అతను 69 బంతులు ఎదుర్కొన్నాడు. అయితే, కోహ్లీ క్యాచ్ ఔట్ పై వివాదం నడుస్తోంది. కాగా, గత 6 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు.
22 నవంబర్ 2024న పెర్త్‌లో అజేయంగా 100 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటి నుండి విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి మరోసారి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. అప్పటి నుండి విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్‌లలో 7, 11, 3, 36, 5, 17 పరుగులు ఇన్నింగ్స్ లను ఆడాడు. దీంతో అతను ఇప్పుడు విమర్శలకు టార్గెట్ గా మారాడు. రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ కూడా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
Sanjay Manjrekar on Virat Kohli's decision. (Star Sports).
- He said "I think that was right decision by Third Umpire, it was not out". pic.twitter.com/MQOjojcuPt
ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్ భారత జట్టు గెలుచుకున్న తర్వాత కింగ్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు టెస్టు, వన్డే ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్నాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా విరాట్ కోహ్లీ దాదాపు ఏడాది పాటు సెంచరీ చేయలేదు. విరాట్ కోహ్లీ తన చివరి 5 వన్డే మ్యాచ్‌ల్లో 117, 54, 24, 14, 20, పరుగులు చేశాడు.
శ్రీలంకతో గత సంవత్సరం (2024) ఆగస్టులో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 58 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ తన చివరి వన్డే శతకం 15 నవంబర్ 2023న న్యూజీలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్‌లో సాధించాడు. విరాట్ కోహ్లీ ఆ సమయంలో 117 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయస్సు ఇప్పుడు 36 సంవత్సరాలు.
ప్రస్తుతం ఆటతీరు గమనిస్తే విరాట్ కోహ్లీ శతకాలు సాధించే వేగం అటు ఇటు అయిపోయినట్లుగా ఉంది. విరాట్ కోహ్లీకి ఇప్పుడు పరుగులు చేయాలనే ఆకాంక్ష కూడా తగ్గినట్లుగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, ఆడుతున్న తీరు కూడా ఇదే ప్రతిబింబిస్తుంది. విరాట్ కోహ్లీ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 100 శతకాల గొప్ప రికార్డును అధిగమించడం కష్టమే అని చెప్పాలి.
సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని తరచుగా పోటీదారుగా పేర్కొంటుంటారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 81 సెంచరీలను కలిగి ఉన్నాడు. అతను సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి 20 సెంచరీల దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీకి 36 ఏళ్లు. విరాట్ కోహ్లీ 2027 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగితే ప్రతి సంవత్సరం కనీసం 7 సెంచరీలు సాధించాలి. విరాట్ కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ 2008లో శ్రీలంకపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ కాలంలో విరాట్ కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలు, టెస్టుల్లో 30 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఏకైక సెంచరీ ఇదే.
1. సచిన్ టెండూల్కర్ (భారత్) - 100 సెంచరీలు
2. విరాట్ కోహ్లీ (భారత్) - 81 సెంచరీలు
3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 71 సెంచరీలు
4. కుమార్ సంగక్కర (శ్రీలంక) - 63 సెంచరీలు
5. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) - 62 సెంచరీలు
మను భాకర్, డి గుకేష్ సహా నలుగురికి ఖేల్ రత్న.. 32 మంది ఆటగాళ్లకు అర్జున అవార్డు
అశ్విన్ 8 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపుతున్న బుమ్రా