Team India : భారత క్రికెట్ జట్టుకు వెన్నెముకగా ఉన్న సీనియన్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. దీంతో ప్రస్తుతం భారత జట్టు పలు క్లిష్టమైన మార్పులను ఎదుర్కొంటున్నది.
Team India : రాబోయే కాలంలో భారత క్రికెట్ జట్టు కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికే విషయాన్ని ప్రస్తావించారు. అయితే, భారత జట్టు యువ ఆటగాళ్లను కలిగి ఉన్న తీరు, మార్పుల కాలాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కూడా రాథోడ్ చెప్పాడు. మార్పు దశ క్రమంగా నియంత్రిత పద్ధతిలో జరగాలని చెప్పాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతానికి వన్డే ఇంటర్నేషనల్-టెస్ట్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తారు. అయినప్పటికీ వారి కెరీర్ చివరి దశలో ఉండటంతో రాబోయే కొన్నేళ్లలో టీమిండియా అనేక మార్పులు చూస్తుందని చెప్పాడు.
విక్రమ్ రాథోడ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'రోహిత్, విరాట్ స్థాయి ఆటగాళ్లను భర్తీ చేయడం అంత సులభం కాదు' అని అన్నారు. జింబాబ్వేతో ఇటీవల ముగిసిన సిరీస్ భవిష్యత్తులో టీ20 జట్టు ఎలా ఉండబోతుందనే సూచనను ఇస్తోంది. అయితే టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మనం ఆ స్థానానికి చేరుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం ఉంది. దీని గురించి విక్రమ్ మాట్లాడుతూ.. 'నేను పెద్దగా ఆందోళన చెందను. భారత క్రికెట్‌లో మాకు చాలా డెప్త్ ఉంది. ఎంతో మంది ప్రతిభ, నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వస్తున్నారు. మార్పు నియంత్రిత పద్ధతిలో జరిగేలా చూసుకోవాలి. ఇది నెమ్మదిగా చేయాల్సిన అవసరం ఉందని' తెలిపాడు.
undefined
Team India : టీమిండియా భవిష్యత్ ముగ్గురు మొనగాళ్లు.. !
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికే సమయానికి, రాబోయే 10 సంవత్సరాల పాటు జట్టుకు కేంద్రంగా మారే సుస్థిరమైన యువ స్టార్లు ఉన్నారని విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. అప్పటికి శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ వంటి ఆటగాళ్లు తమను తాము మరింతగా మెరుగుపర్చుకుని ఈ మార్పులను సులభతరం చేస్తారని చెప్పాడు. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో కూడా శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తమ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని రాథోడ్ చెప్పాడు.
భవిష్యత్తులో రోహిత్-విరాట్ లాగే గిల్, జైస్వాల్ కీలక పాత్ర..
ఒక దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్ భారాన్ని కోహ్లీ, రోహిత్ భుజానకెత్తుకున్నట్లే, ఆ తర్వాతి దశాబ్దం కూడా గిల్, జైస్వాల్ లది కావచ్చని విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. ఎంతో మంది మంచి ఆటగాళ్లు వస్తున్నారు కానీ, ఈ ఇద్దరు మూడు ఫార్మాట్లలో ఎక్కువ కాలం ఆడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. రానున్న కాలంలో వీరిద్దరూ భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారనున్నారని అభిప్రాయపడ్డారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 : ప్రారంభానికి ముందే పోటీలు.. భారత షెడ్యూల్ ఇదిగో