Team India: ఇటీవల ముగిసిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భారత్ వరుస 10 విజయాలతో ఫైనల్ చేరుకుంది. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేసిన తప్పులను అంగీకరించాలని అన్నారు.
Indian cricket team: ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ 2023 ప్రపంచకప్ ఫైనల్లో ట్రోఫీ గెలిచే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. సెమీఫైనల్ సహా రెండుసార్లు న్యూజిలాండ్ ను ఓడించిన భారత్ 10 మ్యాచ్ ల విజయ పరంపరలో భాగంగా ఫైనల్ చేరుకుంది. అయితే భారత్ కు సవాలు విసిరి.. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఆరో ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
45 రోజుల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడినప్పటికీ ట్రోఫీ గెలవని భారత జట్టు పోరాటం పై ప్రశంసలు కురిశాయి. కానీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు చేసిన పలు తప్పిదాలను మాజీ క్రికెటర్స్, క్రీడా విశ్లేషకులు ఎత్తిచూపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబర్ 19 ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత జట్టు చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
'భారత్ ట్రోఫీ గెలవాలంటే ఫైనల్లో చేసిన కొన్ని పొరపాట్లను అంగీకరించాలి. సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించడం ఒకటే కానీ తప్పులను అంగీకరించకపోతే పురోగతి పెద్దగా ఉండదు. రాబోయే కొన్ని వారాల్లో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది' అని పేర్కొన్నాడు. అలాగే, '2007 తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవకపోవడం ఆటగాళ్లు, యువ ఆటగాళ్లకు ఐపీఎల్ లో లభించే ఎక్స్పో జర్నీ పరిగణనలోకి తీసుకుంటే తీవ్ర నిరాశకు గురిచేస్తోంది' అని గవాస్కర్ పేర్కొన్నారు.
అలాగే, భారత్ ప్రపంచకప్ గెలవకపోవడం నిరాశ కలిగించిందనడంలో సందేహం లేదు, కానీ అది ఇప్పుడు ముగిసిపోయిందన్నారు. అయితే, క్రికెట్ ముందుకు సాగుతున్నదని తెలిపారు. దానికి అనుగుణంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. గత నాలుగు ప్రపంచ కప్ లలో భారత జట్టు ఒక విజయంతో రెండుసార్లు ఫైనల్ కు చేరగా, మరో రెండు సార్లు సెమీస్ కు చేరుకుంది. ఇతర జట్లతో పోల్చినప్పుడు అది అద్భుతమైన ప్రదర్శనగా పేర్కొన్న గవాస్కర్.. ట్రోఫీ విజయాల్లో ఆస్ట్రేలియా మాత్రమే మెరుగ్గా ఉందన్నారు.