rahul dravid : టీమిండియా హెడ్ కోచ్ గా మళ్లీ రాహుల్ ద్రవిడ్.. పదవీకాలాన్ని పొడిగించిన బీసీసీఐ

By Asianet News  |  First Published Nov 29, 2023, 2:58 PM IST

Team India head coach : టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ మళ్లీ అదే పదవిలో కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రపంచకప్ లో భారత జట్టను ఫైనల్ కు తీసుకురావడంలో ద్రవిడ్ పాత్రను ప్రశంసించింది. 


Team India head coach rahul dravid : టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ మరింత కాలం సేవలు అందించనున్నారు. ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత ఆయన కాంట్రాక్ట్ అధికారికంగా ముగిసింది. దీంతో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్ కు దూరంగా ఉన్నారు. అయితే బీసీసీఐ తాజా నిర్ణయంతో ద్రవిడ్, అతడి సహాయక సిబ్బంది దక్షిణాఫ్రికాలో పర్యటించి అక్కడ భారత్ 3 టీ20లు, వీలైనన్ని వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.

digital payment frauds: డిజిటల్ లావాదేవీల మోసాలపై కేంద్రం ఉక్కుపాదం.. 70 లక్షల మొబైల్ నెంబర్లు సస్పెండ్..

Latest Videos

undefined

ఇటీవల జరిగిన ప్రపంచకప్ లో భారత జట్టను ఫైనల్ కు తీసుకురావడంలో ద్రవిడ్ పాత్రను ప్రశంసిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఈ హెడ్ కోచ్ తో పాటు విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్)లతో కూడిన సహాయక సిబ్బంది కూడా తమ తమ బాధ్యతల్లో కొనసాగనున్నారు. అయితే కోచింగ్ సిబ్బంది పదవిని ఎంత కాలం పొడగించిందో బీసీసీఐ స్పష్టంగా పేర్కొనలేదు. 

NEWS 🚨 -BCCI announces extension of contracts for Head Coach and Support Staff, Team India (Senior Men)

More details here - https://t.co/rtLoyCIEmi

— BCCI (@BCCI)

బీసీసీఐ కార్యదర్శి జై షా ద్రవిడ్ సారథ్యంలో చేసిన కృషిని ప్రశంసించారు. ప్రపంచ కప్ లో ఆయన నేతృత్వంలోని జట్టు ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రశంసించారు. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను మించిన వ్యక్తి లేరని తాను చెప్పానని, ఆయన తన అసమాన నిబద్ధతతో తనను తాను మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. 

అయ్యో.. క్లాత్ షోరూంలో గ్లాస్ డోర్ పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వీడియో వైరల్.. పేరెంట్స్ పై నెటిజన్ల ఆగ్రహం

ఫైనల్ కు ముందు వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన తీరు అసాధారణమైనది కాదని జై షా అన్నారు. జట్టు ఎదగడానికి సరైన వేదికను ఏర్పాటు చేశారని, ఆయన ప్రశంసలకు అర్హుడని అన్నాడు. హెడ్ కోచ్ కు తమ పూర్తి మద్దతు ఉందని, అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన విజయానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

మరి దేవాలయాల్లో హారతి సంగతేంటి ? : మసీదులో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలన్న పిటిషన్ పై హైకోర్టు వ్యాఖ్యలు..

‘‘నాపై నమ్మకం ఉంచినందుకు, నా విజన్ ను సమర్థించినందుకు, ఈ సమయంలో మద్దతు ఇచ్చినందుకు బీసీసీఐ, ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. ఈ పదవిలో కొనసాగాలంటే ఇంటికి దూరంగా ఉండాలి. ఇలాంటి సమయంలో నా కుటుంబం చేసిన త్యాగాలు, వారు ఇస్తున్న మద్దతు ధన్యవాదాలు. తెరవెనుక వారి పాత్ర వెలకట్టలేనిది. ప్రపంచ కప్ తర్వాత కొత్త సవాళ్లను స్వీకరించేందుకు, బెస్ట్ ప్రాక్టీస్ కు కట్టుబడి ఉన్నాం’’ అని టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా పదవీ విరమణ చేసిన తర్వాత ద్రవిడ్ అన్నారు.

click me!