Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొల‌గించింది అందుకే..

By Mahesh Rajamoni  |  First Published Feb 6, 2024, 11:47 AM IST

Mumbai Indians: ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఆ టీమ్ కు ఐదు ఐపీఎల్ టైటిల్ల‌ను అందించాడు. వ్య‌క్తిగ‌తంగా అనేక రికార్డుల మోత మోగించాడు. అయితే, రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించ‌డం గురించి ముంబై ఇండియ‌న్స్ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసింది.


Rohit Sharma- Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను తొల‌గించి, జ‌ట్టు ప‌గ్గాలు హార్దిక్ పాండ్యాకు అప్ప‌గించ‌డంపై క్రికెట్ వ‌ర్గాల్లో ఇంకా హాట్ టాపిక్ గానే కొన‌సాగుతోంది. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ కు పెట్టింది పేరు, జ‌ట్టుకు ఎన్నో విజ‌యాలు అందించిన రోహిత్ శ‌ర్మ‌ను కాద‌ని ముంబై ఇండియ‌న్స్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చార‌నే విష‌యం మ‌రోసారి  హాట్ టాపిక్ గా మారింది. రోహిత్ శ‌ర్మ‌ను తొల‌గించ‌డం గురించి ముంబై స్పందించింది. కెప్టెన్సీ మార్పుపై సోషల్ మీడియాలో ముంబై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, హెడ్ కోచ్ మార్క్ బౌచర్ మాత్రం ఇది క్రికెట్ నిర్ణయమంటూ పేర్కొన్నారు.

'ఇది పూర్తిగా క్రికెట్ నిర్ణయమని నేను అనుకుంటున్నాను. హార్దిక్ పాండ్యాను తిరిగి ఆటగాడిగా తీసుకురావడానికి విండో పీరియడ్ చూశాం. నాకు ఇది పరివర్తన దశ. భారతదేశంలో చాలా మందికి అర్థం కాదు, ప్రజలు చాలా భావోద్వేగానికి గురవుతారు, కానీ మీరు భావోద్వేగాలను దాని నుండి దూరం చేస్తారని మీకు తెలుసు. ఇది కేవలం క్రికెట్ నిర్ణయం మాత్రమేనని నేను అనుకుంటున్నాను. ఇది ఆటగాడిగా ఒక వ్యక్తిగా రోహిత్ శ‌ర్మ‌ నుండి ఉత్తమమైనదాన్ని తీసుకువస్తుందని నేను అనుకుంటున్నాను. అత‌న్ని క్రికెట్ ఆస్వాదించి మంచి పరుగులు చేయనివ్వండి' అని మార్క్ బౌచర్ వ్యాఖ్యానించాడు.

Latest Videos

IND VS ENG: భార‌త్ గెలుపులో అత‌నే రియ‌ల్ హీరో.. బుమ్రా-జైస్వాల్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' ర‌గ‌డ !

అలాగే, త‌మ‌ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాట్ తో రెండు సాధారణ సీజన్లు ఆడిన రోహిత్ శ‌ర్మ నుంచి కెప్టెన్సీ భారాన్ని, హైప్ ను దూరం చేయాలనే ముంబై జ‌ట్టు ఉద్దేశాన్ని బౌచర్ నొక్కి చెప్పాడు. 2022లో రోహిత్ 120.18 స్ట్రైక్ రేట్ తో 268 పరుగులు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాడు. 2023లో 132.80 సగటుతో 332 పరుగులు చేయ‌గా, జట్టు రెండో క్వాలిఫయర్ లో ఓడిపోయిందని గుర్తు చేశాడు. రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ప్లేయ‌ర్ అనీ, ముంబైకి అనేక విజ‌యాలు అందించార‌నీ, ఇప్పుడు భార‌త జ‌ట్టుకు కూడా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడ‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం అత‌ను బీజీగా క‌నిపిస్తున్నాడ‌నీ, ఎక్క‌డికి వెళ్లినా అత‌నిపై అన్నికెమెరాలు ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. గ‌త రెండు సీజ‌న్ల‌లో ప్లేయ‌ర్ గా రాణించ‌లేక‌పోయాడు కానీ, కెప్టెన్ గా స‌క్సెస్ అయ్యాడ‌ని బౌచ‌ర్ తెలిపాడు. 

ముంబయి ఇండియ‌న్స్ జ‌ట్టుకు ఇదే స‌రైన స‌మంగా భావించామ‌నీ, కెప్టెన్ అనే హైప్ లేకుండా రోహిత్ శ‌ర్మ ఆడ‌టానికి ఇది గొప్ప అవ‌కాశ‌మ‌ని తెలిపాడు. అలాగే, రోహిత్ భార‌త కెప్టెన్ కావ‌డంతో మ‌రింత హైప్ ఉంటుంద‌ని అన్నాడు. ఐపీఎల్ లో కెప్టెన్సీ భారం త‌గ్గించి మ‌రింత ఉత్త‌మ‌మైన స‌మ‌యాన్ని గ‌డిపేందుకు అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపాడు. ఇదే స‌మ‌యంలో రోహిత్ స్థానంలో వ‌స్తున్న హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించాడని బౌచర్ కొనియాడాడు. 2022 సీజన్ కు ముందు వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన హార్దిక్ ఆ ఏడాది టైటిల్ ను అందించ‌డంతో పాటు 2023లో రన్నరప్ గా నిలిపాడు.

అత‌ను ఛాంపియన్ ప్లేయర్.. ఇంగ్లాండ్ సిరీస్ పై రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైరల్ !

click me!