ఇక వాళ్లకు మిగిలింది ఒక్క ఇన్నింగ్సే.. అది కూడా పోతే అంతే.. టీమిండియా సీనియర్లపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Jan 03, 2022, 09:08 PM IST
ఇక వాళ్లకు మిగిలింది ఒక్క ఇన్నింగ్సే.. అది కూడా పోతే అంతే.. టీమిండియా సీనియర్లపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

India Vs South Africa: వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ల ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

భారత టెస్టు మిడిలార్డర్ ద్వయం ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ల పేలవ ఫామ్ పై తీవ్ర  స్థాయిలో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో అయినా వీళ్లు మునపటి ఫామ్ అందుకుంటారని ఆశించిన అభిమాలను మరోసారి నిరాశకు గురి చేస్తూ ఈ జంట దారుణంగా ఔటయ్యారు. సెంచూరియన్ లో డకౌట్ తో తీవ్ర విమర్శల పాలైన నయావాల్ పుజారా..   తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫర్వాలేదనిపించినా మళ్లీ రెండో టెస్టులో అదే బాటలో పయనించిన రహానేపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

వాళ్లిద్దరికీ ఒక్కటంటే ఒక్కటే అవకాశం మిగిలుందని, అందులో కూడా నిరూపించుకోకపోతే ఇక అంతే సంగతులని వ్యాఖ్యానించాడు.  సౌతాఫ్రికాతో జరుగుతన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో రాణించకుంటే రహానే, పుజారాల కెరీర్ కు  ముగింపు పడ్డట్టేనని చెప్పకనే చెప్పాడు. 

గవాస్కర్ మాట్లాడుతూ... ‘ఈరోజు ఆ ఇద్దరూ ఔటైన తర్వాత ఇక ఆ ఇద్దరికీ ఒకటే ఇన్నింగ్స్ బాకీ ఉందని అర్థమవుతున్నది. వాళ్ల టెస్టు కెరీర్ లను కాపాడుకోవాలంటే వచ్చే ఇన్నింగ్స్ లో వాళ్లిద్దరూ తప్పక రాణించాల్సి ఉంది. ఆ ద్వయం (రహానే, పుజారా) ఔటయ్యాక చాలా మంది  జట్టులో  వారి స్థానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఒక ఇన్నింగ్సే మిగిలుందని అంటున్నారు. ఒకవేళ ఈ టెస్టులో ఇండియా  రెండో ఇన్నింగ్స్ కు  వెళ్తే ఆ ఇన్నింగ్సులో అయినా వాళ్లిద్దరూ  బాగా ఆడాలి...’ అని వ్యాఖ్యానించాడు. 

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన పుజారా, రెండో ఇన్నింగ్స్ లో 16 పరుగులే చేశాడు. ఇక జోహన్నస్బర్గ్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 33 బంతులాడి 3 పరుగులే చేశాడు. మరోవైపు రహానే కూడా ఇదే పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్సులలో వరుసగా 48, 20 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్  లో డకౌట్ అయ్యాడు. 

 

ఇదిలాఉండగా ఈ ద్వయం పేలవ ప్రదర్శనపై టీమిండియా అభిమానులు,  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఇద్దరికీ ఇచ్చినన్ని అవకాశాలు ఈమధ్య కాలంలో ఏ భారత ఆటగాడికీ ఇవ్వలేదని, అయినా వాళ్లు వాటిని చేజేతులా  నాశనం  చేసుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ జంట పాతదైపోయిందని (పురానే).. వెంటనే టెస్టు జట్టు నుంచి వీరిని తప్పించి వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి సూచిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు