Team India victory parade : టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ టీమిండియా గెలుపు సంబరాల్లో యావత్ భారతావని పాల్గొంది. ముంబైలో జరిగిన విజయ పరేడ్ లో లక్షలాది మంది పాల్గొన్నారు. రోహిత్ తో పాటు హార్దిక్ పాండ్యా పేర్లతో స్టేడియం దద్దరిల్లింది.
Team India victory parade : టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న టీమిండియాకు ఘనంగా స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే మన ఆటగాళ్లతో పాటు యావత్ భారతావని ముఖ్యంగా క్రికెట్ లవర్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ముంబైలో అయితే క్రికెట్ జాతర కనిపించింది. మెరైన్ డ్రైవ్‌లో జట్టు విజయోత్సవ పరేడ్‌తో పాటు వాంఖడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆటగాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ చెక్కును బీసీసీఐ కార్యదర్శి జై షా జట్టుకు అందజేశారు. అయితే, కార్యక్రమం కొనసాగుతుండగా ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతుండగా, హార్దిక్ పాండ్యాను ప్రశంసించారు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం 'హార్దిక్-హార్దిక్' అని మారుమోగింది.
విమర్శలు ఎదుర్కొన్న చోటే 'హార్ధిక్ హార్దిక్' అంటూ దద్దరిల్లిన వాంఖడే
undefined
ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించి, హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే, కెప్టెన్సీతో పాటు ప్లేయర్ గా కూడా పెద్ద ఇన్నింగ్స్ లను ఆడకపోవడంతో అందరికీ టార్గెట్ గా మారాడు. మరీ ముఖ్యంగా ముంబై ఫ్యాన్స్ అయితే హార్దిక్ పై ఘాటు విమర్శలతో దాడి చేశారు. ఈ ఆల్‌రౌండర్‌కి సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. విపరీతంగా ట్రోల్ చేశారు. ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రదర్శనకు హార్దిక్ పాండ్యాను నిందించారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. గురువారం సాయంత్రం, అదే వాంఖడే స్టేడియంలో హార్దిక్ ను పొగడ్తలతో ముంచెత్తారు. హార్దిక్ హార్దిక్ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు అభిమానులు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి.
Goosebumps 🔥
Mumbai crowd chanting
"HARDIK... HARDIK..." 🥶 pic.twitter.com/qELzvruV5G
ముంబైలో టీమిండియా రచ్చ రంబోల.. వర్షం కూడా లెక్కలేదు.. క్రికెట్ లవర్స్‌కు జాతరే ! వీడియో