హైదరాబాదీ బౌలర్ పై సచిన్ ప్రశంసలు.. మీ మాటలు ఉత్తేజాన్నిచ్చాయంటూ టీమిండియా పేసర్ ట్వీట్

Published : Dec 22, 2021, 06:58 PM ISTUpdated : Dec 22, 2021, 07:00 PM IST
హైదరాబాదీ బౌలర్ పై సచిన్  ప్రశంసలు.. మీ మాటలు ఉత్తేజాన్నిచ్చాయంటూ టీమిండియా పేసర్ ట్వీట్

సారాంశం

Sachin Tendulkar Praised Mohammed Siraj: జట్టులోకి కొత్తగా వచ్చిన ఓ యువ ఆటగాడిని  ఆ దేశానికి చెందిన దిగ్గజం  ప్రశంసల్లో ముంచెత్తితే ఎలా ఉంటుంది..? పక్కా హైదరాబాదీ అయిన  సిరాజ్ ప్రస్తుతం అదే ఫీల్ లో ఉన్నాడు. 

ఏ ఆటగాడికైనా అతడు/ఆమె ఆడుతున్న ఆటలో దిగ్గజాలు తనను గుర్తిస్తే  అంతకంటే కావాల్సిందేముంటుంది..? ఇంక సదరు ఆటగాడి  ప్రదర్శనకు వాళ్లు ముగ్దులై ఆ క్రీడాకారుడిని పొగిడితే అది ఆ వాళ్లకు లైఫ్ టైమ్ అచీవ్మెంటే..  తాజాగా టీమిండియా యువ పేసర్,  పక్కా హైదరాబాదీ అయిన మహ్మద్ సిరాజ్ ఇంచుమించు ఇదే స్టేజ్ లో ఉన్నాడు. భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఇటీవల సిరాజ్ ను ప్రశంసల్లో ముంచెత్తడమే ఇందుకు కారణం. సచిన్  మాటలతో సిరాజ్  ఆకాశంలో తేలుతున్నాడు.  మీ మాటలు ఎంతో స్ఫూర్తిని నింపాయి సార్.. అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 

వివరాల్లోకెళ్తే..  ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బొరియా మజుందార్ తాజాగా సచిన్ టెండూల్కర్ తో ఓ ఇంటర్వ్యూ చేశాడు. బ్యాక్ స్టేజ్ విత్ బొరియా అనే షో ద్వారా పాపులరైన మజుందార్.. సిరాజ్ గురించి  సచిన్ ను అడిగాడు. దానికి సచిన్ సమాధానం చెబుతూ.... 

 

‘అతడు మంచి నైపుణ్యమున్న ఫాస్ట్ బౌలర్. అతడి బాడీ లాంగ్వేజ్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. సిరాజ్ లో అది నేను చాలా ఇష్టపడతాను. అతడు త్వరగా నేర్చుకుంటాడు. గతేడాది ఆసీస్ లో మెల్బోర్న్ టెస్టు అతడి అరంగ్రేట  మ్యాచ్. కానీ అతడిని చూస్తే సిరాజ్ కు ఇది మొదటి మ్యాచ్ అనిపించదు.  అతడు ఇన్నింగ్సులో ఫస్ట్ ఓవర్ వేసినా.. చివరి ఓవర్ వేసినా ఫ్రెష్ గా కనిపిస్తాడు. అతడి కాళ్లలో  స్ప్రింగ్ ఉన్నట్టుగా పరిగెడతాడు. అతడిని చూసిన ప్రతిసారి ఏదో కొత్తగా కనిపిస్తాడు...’ అని సచిన్ చెప్పాడు. ఈ వీడియో క్లిప్ ను బొరియా షేర్ చేశాడు. 

 

కాగా ఈ ట్వీట్ కు సిరాజ్ రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్యూ సచిన్ సార్.  మీ నుంచి ప్రశంసలు రావడం అది నాకు చాలా పెద్ద ప్రేరణ. నేను ఎల్లప్పుడూ నా దేశం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను....’ అని  రాసుకొచ్చాడు. 

ఈనెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో  సెంచూరీయన్ వేదికగా జరుగబోయే తొలి టెస్టులో   ఆడే అవకాశముంది. ఇషాంత్ శర్మకు అవకాశమివ్వకుంటే కోహ్లీ.. సిరాజ్ ను ఆడించే ఛాన్సులే ఎక్కువున్నాయి. ముగ్గురు పేసర్లతో వెళ్లాలనుకుంటే విరాట్ కు  బుమ్రా, షమీలతో పాటు  సిరాజ్ బెస్ట్ ఆప్షన్.  అదీగాక  స్వతహాగా  పేసర్ అయిన సిరాజ్..  సౌతాఫ్రికాలోని పేస్ పిచ్ లపై అదరగొడతానడంలో సందేహం లేదు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే