టీమిండియా విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు.. కుప్పలుగా చెప్పులు !

By Mahesh RajamoniFirst Published Jul 5, 2024, 12:39 PM IST
Highlights

Team India victory parade : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీ గెలిచిన భార‌త జ‌ట్టు సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఛాంపియ‌న్ హీరోల‌ను చూసేందుకు పెద్ద సంఖ్య‌లో అభిమానులు వ‌చ్చారు. టీమిండియా విక్ట‌రీ ప‌రేడ్ ప్రాంతం జ‌నంతో కిక్కిరిసిపోయిన వీడియోలు వైరల్ గా మారాయి. 
 

Team India victory parade : టీ20 ప్రపంచకప్ 2024 ఫైన‌ల్ లో ద‌క్షిణాఫ్రికాను ఓడించి భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్ గా నిలిచింది. ఐసీసీ ట్రోఫీతో భారత గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త జ‌ట్టుకు ఘ‌నంగా స్వాగ‌త ల‌భించింది. ఢిల్లీలో మొద‌లైన టీమిండియా విజ‌యోత్స‌వ సంబరాలు ముంబైలో అంబ‌రాన్ని అంటాయి. విక్ట‌రీ ప‌రేడ్ తో ముంబై విధులు జ‌నంతో కిక్కిరిపిపోయాయి. త‌మ అభిమాన క్రికెట్ హీరోల‌ను చూసేందుకు, టీమిండియా విజ‌య సంబ‌రాల్లో పాలు పంచుకోవ‌డానికి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు వ‌చ్చారు. దీంతో విక్ట‌రీ ప‌రేడ్ జ‌రిగే ప్రాంతంలో ఇసుక‌వేసిన రాల‌నంత‌గా జ‌నంతో నిండిపోయింది. 

సాయంత్ర‌ం పెద్దగా జ‌నం క‌నిపించిన ఈ ముంబై రోడ్లు టీమిండియా విక్ట‌రీ ప‌రేడ్ తో జ‌న‌సంద్రోహంతో నిండిపోయాయి. మధ్యాహ్నం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన టీమిండియా విక్ట‌రీ ప‌రేడ్ అస్తవ్యస్తమైన ప్రేక్షకుల కారణంగా రెండు గంటల ఆలస్యం జరిగింది. ఆ త‌ర్వాత కూడా చాలా స‌మ‌యం పాటు వేచిచూడాల్సి వ‌చ్చింది. ఇక టీమిండియా ఓపెన్ బ‌స్ విక్ట‌రీ ప‌రేడ్ ప్రారంభం త‌ర్వాత మ‌రింత‌గా జ‌నం పెరిగారు. టీమిండియా ఛాంపియ‌న్ క్రికెట‌ర్ల‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌గా చూడ‌టం కోసం క్రికెట్ అభిమానులు ఎగ‌బ‌డ్డారు. దీంతో ప‌రేడ్ కొన‌సాగిన ప‌లు ప్రాంతాల్లో తొక్కిస‌లాట కూడా జ‌రిగింది. అదృష్టం కొద్ది ఎలాంటి ప్ర‌మాదాలు, మ‌ర‌ణాలు చోటుచేసుకోలేదు. ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్య‌లో జ‌నాల చెప్పులు, షూలు క‌నిపించాయి.

 

India won T20 World Cup, Mumbai lost many slippers. pic.twitter.com/hAdJzteHZd

— Mangalam Maloo (@blitzkreigm)

 

టీమిండియా విక్ట‌రీ ప‌రేడ్ కొన‌సాగిన రోడ్డు చెప్పుల‌తో నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. విక్ట‌రీ ప‌రేడ్ సంద‌ర్భంగా పోలీసులు గానీ, అధికారులు గానీ స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప‌లువురు క్రిక‌ట్ అభిమానులు మీడియాతో అన్నారు. దీని కార‌ణంగా తోపులాట‌, తొక్కిస‌లాట వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని తెలిపారు.

 

| Maharashtra: "...The crowd started increasing and there was no protection from the police. Nothing was streamlined. As the team arrived people started shouting and those standing ahead of me fell...," says Ravi Solanki, a cricket fan present at Marine Drive during the… https://t.co/ZDWk0LZ8Ng pic.twitter.com/7Ynl1fdQz9

— ANI (@ANI)

 

టీమిండియా విజ‌య్ ప‌రేడ్ లో క్రికెట్ ల‌వ‌ర్స్ ఉత్సాహం ఊర‌క‌లేసింది. ఇండియా ఇండియా అంటూ ముంబై న‌గ‌రాన్ని హోరెత్తించారు. ఈ ప‌రేడ్ ను ముంగించుకుని భార‌త జ‌ట్టు వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగే విక్ట‌రీ వేడుక‌ల‌కు వ‌చ్చింది. క్రికెట్ అభిమానుల‌కు ఉంచితంగానే ప్ర‌వేశం క‌ల్పించ‌డంతో స్టేడియం జ‌నంతో కిక్కిరిసిపోయింది. అప్ప‌టికే నిండిపోవ‌డంతో స్టేడియం వెలుప‌ల కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు ఉండిపోయారు. వ‌ర్షం కూడా లెక్క‌చేయ‌కుండా టీమిండియా విజ‌యోత్స‌వ సంబ‌రాల‌ను మ‌న ఛాంపియ‌న్ క్రికెట‌ర్ల‌తో క‌లిసి జ‌రుపుకున్నారు.

"సచిన్... సచిన్," "ముంబైచా రాజా, రోహిత్ శర్మ!.. హార్దిక్ హార్దిక్.. కోహ్లీ కోహ్లీ అంటూ వాంఖ‌డే స్టేడియాన్ని క్రికెట్ ల‌వ‌ర్స్ హోరెత్తించారు. అంత‌కుముందు, తుఫాను కార‌ణంగా టీమిండియా వెస్టిండీస్ లో చిక్కుకుపోయింది. అయితే, ప‌రిస్థితులు కాస్త  మెరుగుప‌డ్డ త‌ర్వాత బీసీసీఐ ప్ర‌త్యేక విమానం పంప‌డంతో భార‌త క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశానికి చేరుకుంది. ఢిల్లీలో ఘ‌నంగా స్వాగ‌తం ల‌భించింది. ఆ త‌ర్వాత ప్ర‌ధాని మోడీతో టీమిండియా ప్లేయ‌ర్లు ప్ర‌త్యేక స‌మావేశ‌మ‌య్యారు. ఈ మీటింగ్ పూర్తయిన త‌ర్వాత నేరుగా ముంబై చేరుకుంది టీమిండియా. అక్క‌డ భార‌త జ‌ట్టు విజ‌యోత్స‌వ సంబ‌రాలు జ‌రుపుకుంది.

అప్పుడు విమ‌ర్శ‌లు ఇప్పుడు పొగ‌డ్త‌లు.. 'హార్ధిక్ హార్దిక్' అంటూ ద‌ద్ద‌రిల్లిన వాంఖ‌డే.. వీడియో

click me!