India vs Afghanistan: తొలి రెండు మ్యాచుల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేయాలని టీమిండియా చూస్తోంది. ఇక దాదాపు 14 నెలల విరామం తర్వాత టీ20 రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
India vs Afghanistan T20 Match: భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ ను విజయవంతంగా ముంగించాలని భారత్ టార్గెట్ చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో తిరుగులేని అధిపత్యం ప్రదర్శించిన భారత్ మూడో టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తుచేయాలని చూస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ బుధవారం జరగనుంది. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే హాఫ్ సెంచరీతో పాటు తిలక్ వర్మ, జితేష్ శర్మలు రాణించడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించింది.
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్ రౌండర్ శివ దూబే హాఫ్ సెంచరీలతో ఆఫ్ఘన్ బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో భారత్ మరోసారి ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తుచేసింది. అయితే, మూడో మ్యాచ్ కు అతిథ్యం ఇస్తున్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనూ విజయపరంపరను కొనసాగించాలని భావిస్తోంది భారత్. ముఖ్యంగా చాలా కాలం తర్వాత 20 క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుంచి భారీ ఇన్నింగ్స్ ల కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లోని రెండు మ్యాచ్ లలో ఒక్కపరుగు చేయకుండానే డకౌట్ అయిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో అదరగొట్టాలని చూస్తున్నాడు.
undefined
IND VS AFG: చిన్నస్వామి గ్రౌండ్ లో పరుగుల వరద.. టాస్ కీలకం.. పిచ్ రిపోర్టు, గత రికార్డులు ఇవే
ఇప్పటికే అఫ్గానిస్థాన్ సిరీస్‌లో 2 విజయాలతో దూకుడుగా ఉన్న భారత్.. అఫ్ఘానిస్తాన్ ను క్లీన్‌స్వీప్‌పై చేసేందుకు కసరత్తు చేస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో భారత్ చివరి మ్యాచ్ జరగనుండగా, రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు తమకు మిగిలి ఉన్న ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడంతో భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నట్టు సమాచారం. రోహిత్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ తో పాటు గత మ్యాచ్‌లో స్ట్రైక్‌రేట్‌ను పెంచడంపై దృష్టి సారించిన కోహ్లి ఈ మ్యాచ్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌ని ఆశిస్తున్నాడు.
ఇక యంగ్ ప్లేయర్స్ గురించి చెప్పుకుంటే భారత యువ సంచలన యశస్వి జైస్వాల్ సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే, శివమ్ దూబే బ్యాట్, బాల్ తోనూ అదరగొడుతూ వరల్డ్ కప్ టీమిండియా ప్లేయర్ రేసులోకి వచ్చాడు. రింకూ సింగ్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను సిరీస్‌లో ఆడిస్తున్న సెలక్షన్ కమిటీ వారి నుంచి మంచి ఇన్నింగ్స్ లను ఆశిస్తోంది. అయితే, ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో జట్టులో పలు మార్పులు జరిగే అవకాశముంది. అయితే, ఈ మ్యాచ్ లో భారత్ కు గెలిచే అవకాశాలు అధికంగానే ఉన్నాయి.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..
ధనాధన్ బ్యాటింగ్., బౌన్సీ బౌలింగ్ తో రాణించాలని చూస్తున్న ఆఫ్ఘన్..
ధనాధన్ ఇన్నింగ్స్, సంచలన బౌలింగ్ కు పేరుగాంచిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఈ సిరీస్ లో నీరసంగా కనిపిస్తోంది. బ్యాటర్లు చెలరేగకపోవడంతో బౌలర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో ఈ గ్రౌండ్ పై భారీ స్కోర్లు నమోదు చేయాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌పై ఉంది.
స్వదేశంలో 6వ సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసిన భారత్
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లను గెలిచిన టీమిండియా.. చివరి, మూడో మ్యాచ్ లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశంలో భారత్ ఇప్పటి వరకు ఐదు టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి 6కి పెంచాలని భారత్ చూస్తోంది. 2017లో శ్రీలంక, 2018లో వెస్టిండీస్, 2021లో న్యూజిలాండ్, 2022లో వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
Praggnanandhaa: గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కినెట్టిన ఆర్ ప్రజ్ఞానంద
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల అంచనాలు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా, కరీం, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హాక్ ఫరూఖీ.
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాత్రి 7 గంటలకు భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
16 సిక్సర్లు, 5 ఫోర్లు.. రికార్డు సెంచరీతో పాక్ బౌలర్లను ఉతికిపారేసిన ఫిన్ అలెన్..