IND vs AFG: చిన్నస్వామి స్టేడియం ఇప్పటివరకు 9 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ వేదికపై మొట్టమొదటి టీ20 డిసెంబర్ 25, 2012న చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగింది. ఇక్కడి పిచ్ బ్యాటర్స్ కు అనుకూలంగా ఉండటంతో పరుగుల వరదపారటం ఖాయం.
India vs Afghanistan: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ బుధవారం జరగనుంది. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే హాఫ్ సెంచరీతో పాటు తిలక్ వర్మ, జితేష్ శర్మలు రాణించడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించింది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్ రౌండర్ శివ దూబే హాఫ్ సెంచరీలతో ఆఫ్ఘన్ బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో భారత్ మరోసారి ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తుచేసింది. అయితే, మూడో మ్యాచ్ కు అతిథ్యం ఇస్తున్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం రికార్డులు, పిచ్ రిపోర్టులు గమనిస్తే పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. గత రికార్డులు గమనిస్తే..
చిన్నస్వామి స్టేడియం ఎన్ని టీ20లకు ఆతిథ్యమిచ్చింది?
చిన్నస్వామి స్టేడియం సుమారు 40,000 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు తొమ్మిది టీ20లకు ఆతిథ్యమిచ్చిన చిన్నస్వామి స్టేడియంలో 2012 డిసెంబర్ 25న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..
బ్యాటర్స్ కు అనుకూలంగా చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్టు
చిన్నస్వామి స్టేడియంలో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా ఉంటుంది. మైదానం చిన్నగా ఉండటంతో పాటు సాపేక్షంగా చిన్న కొలతలు బ్యాట్స్ మన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి అనుకూలించే అంశాలుగా ఉన్నాయి. ఫలితంగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్ సాధారణంగా చదునైన డెక్ గా ఉంటుంది, ఈ వేదికపై దాదాపు అన్ని సాయంత్రం మ్యాచ్ లలో మంచు ప్రభావం చూపే అవకాశముంటుంది. భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మూడో టీ20లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చిన్నస్వామి స్టేడియంలో గత గణాంకాలు ఇవే..
చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 9 టీ20 మ్యాచ్ లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సగటు ఇన్నింగ్స్ స్కోరు 141 పరుగులు కాగా, 3 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. అయితే, లక్ష్య ఛేధనలో ఐదు సార్లు టీమ్ లు విజయం సాధించాయి. టీ20ల్లో చిన్నస్వామి స్టేడియంలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు భారత్ పేరుమీదనే ఉంది. 2017 ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్ పై భారత్ చేసిన 202/6 పరుగులే ఈ మైదానంలో అత్యధిక స్కోరు. యుజ్వేంద్ర చాహల్ 6-25 బౌలింగ్ గణాంకాలతో భారత్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే, 2022 జూన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 28-2తో విజయం సాధించింది.
Praggnanandhaa: గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కినెట్టిన ఆర్ ప్రజ్ఞానంద
చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డులు
టీ20ల్లో చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 133 పరుగులు. 2019 ఫిబ్రవరి 27న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20లో గ్లెన్ మ్యాక్స్ వెల్ 55 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేసి 191 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు, రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించాడు. మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ ఒక టీ20లో ఈ వేదికపై నమోదైన అత్యధిక స్కోరు కాగా, ఈ వేదికపై నమోదైన ఏకైక టీ20 సెంచరీ కూడా ఇదే కావడం విశేషం. 2017లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత బౌలర్ యజువేంద్ర చాహల్ 6-25తో రాణించడం ఈ మైదానంలో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్. బెంగళూరులో జరిగిన టీ20లో ఒక బౌలర్ 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. కాగా, ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచిన భారత్ మూడో మ్యాచ్ లోనూ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ ను వైట్ వాష్ చేయాలని చూస్తోంది.
Yuvraj Singh: టీమిండియా మెంటార్‌గా యువరాజ్ సింగ్.. !