రోహిత్, జడేజాల మధ్య ఫుట్‌బాల్ స్టార్ ‘‘జ్లటాన్’’: కొంచెం జాగ్రత్తగా చూస్తే

By Siva KodatiFirst Published Nov 2, 2019, 2:34 PM IST
Highlights

రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో ఒక పాత ఫోటోను షేర్ చేశాడు. దీనికి తమతో పాటు జ్లటాన్ ఉన్నాడు.. అతనితో ఛాటింగ్ చేయడం చాలా సరదాగా అనిపించింది అంటూ కామెంట్ పెట్టాడు.

టెస్ట్ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా తన అరంగేట్రాన్ని విజయవంతంగా నిర్వహించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో ఒక పాత ఫోటోను షేర్ చేశాడు.

దీనికి తమతో పాటు జ్లటాన్ ఉన్నాడు.. అతనితో ఛాటింగ్ చేయడం చాలా సరదాగా అనిపించింది అంటూ కామెంట్ పెట్టాడు. రోహిత్ శర్మ పోస్ట్ చేసిన సదరు ఫోటోలో రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు ఉన్నారు.

అయితే రోహిత్ మాత్రం జాట్లాన్ అని ట్వీట్ చేశాడు.. ఆయన స్వీడిష్ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ... జ్లటాన్ అనగానే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది అతని పోనిటైల్. రోహిత్ పోస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలో ఇషాంత్ శర్మ.. జ్లటాన్‌ లాగే పోనీటైల్‌తో ఉన్నందువల్ల అతనిని జ్లటాన్ అని సంబోధించాడు.

Also Read:కోహ్లీ లేకపోతే టీమిండియా బలహీనమా..? బంగ్లాదేశ్ కెప్టెన్

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాలీవుడ్ స్టార్ రన్ వీర్ సింగ్ స్పందించి...‘‘కూల్’’ అంటూ కామెంట్ చేశాడు. ఆదివారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.

ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయుకాలుష్యం ఉండటంతో క్రికెటర్లు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇది టీ20 మ్యాచ్ కావడంతో పెద్దగా ఇబ్బందులు రావని భావిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో కాలుష్య నియంత్రణా మండలి ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. దీనితో పాటు నవంబర్ 5 వరకు నిర్మాణాలపైనా నిషేధం విధించింది. మరోవైపు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాఠశాలల్లో చిన్నారులకు బ్రీతింగ్ మాస్క్‌లను పంచారు.

అనంతరం కేజ్రీ మాట్లాడుతూ.. రాజధాని నగరం గ్యాస్ ఛాంబర్‌గా తయారైందని.. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టడం వల్లే నగరాన్ని కాలుష్యం కప్పేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read:రవిశాస్త్రిని మరోలా వాడుకుందాం... గంగూలీ కామెంట్స్

రెండు రోజుల పాటు ఇదే రకమైన పరిస్ధితి ఉంటే వాహనాలకు సరిబేసి స్కీమ్ అమలు చేస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది.

సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే బాగుందని.. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమని.. 101-200 మధ్య ఉంటే మధ్యస్తమని.. 201-300 మధ్య అయితే బాగోలేదని.. 301-400 మధ్య అయితే ఏ మాత్రం బాగోలేదని.. 401-500 మధ్య అయితే ప్రమాదకరమని.. 500పైన ఉంటే మిక్కిలి ప్రమాదకరంగా పరిగణిస్తారు. 

click me!