మళ్లీ కష్టాల్లో పడ్డ పాక్ క్రికెటర్ షెహజాద్ అహ్మద్.. ఈసారి బాల్ ట్యాంపరింగ్

By telugu teamFirst Published Nov 1, 2019, 1:40 PM IST
Highlights

ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దృష్టికి వెళ్లడంతో పాటు దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో అజామ్ కెరీర్ డైలమాలో పడింది. బాల్ ట్యాంపరింగ్ కు యత్నించిన అజామ్ పై విచారణ చేపట్టామని... త్వరలోనే అతని పై చర్యలు తీసుకుంటామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

పాక్ క్రికెటర్ షెహజాద్ అహ్మద్ మరోసారి కష్టాల్లో పడ్డాడు. చాలా కాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న షెహజాద్.. ఈసారి బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి మరోసారి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. క్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ పంజాబ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజామ్... సింధ్ తో జరిగిన మ్యాచ్ లో బాల్  ట్యాంపరింగ్ కి పాల్పడ్డాడు.

ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దృష్టికి వెళ్లడంతో పాటు దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో అజామ్ కెరీర్ డైలమాలో పడింది. బాల్ ట్యాంపరింగ్ కు యత్నించిన అజామ్ పై విచారణ చేపట్టామని... త్వరలోనే అతని పై చర్యలు తీసుకుంటామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఫైసలాబాద్ లో సింధ్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండో రోజు ఆటలో షెహజాద్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు రిఫరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో షెహజాద్ కి సమన్లు జారీ చేశారు. దీనిపై ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. క్రమ శిక్షణా నియమావళిని ఉల్లంఘించడం షెహజాద్ కి ఇది తొలిసారేమీ కాదు. 

2018లో యాంటీ డోపింగ్‌ రూల్స్‌ను అతిక్రమించి నాలుగు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దాంతో గతేడాది జూలై 10వ తేదీన అతనిపై సస్పెన్షన్‌ వేటు వేసింది పీసీబీ. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన షెహజాద్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో విమర్శల పాలయ్యాడు. కాకపోతే కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ మాత్రం షెహజాద్‌కు మద్దతుగా నిలవడంతో ఊరట లభించింది. అయితే ఇప్పుడు బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో చిక్కుకున్న షెహజాద్‌పై పీసీబీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.

click me!