KL Rahul : ఐదేళ్ల క్రితం స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'లో పాల్గొన్నారు. ఆ సమయంలో వారు మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఇద్దరు ప్లేయర్లకు రూ. 20 లక్షల జరిమానాతో పాటు బీసీసీఐ సస్పెండ్ చేసింది.
KL Rahul: ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'లో కనిపించిన తర్వాత చెలరేగిన భారీ వివాదం తనను తీవ్రంగా బాధపెట్టిందని టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. తన జీవితంలో ఇప్పటివరకు అత్యంత బాధకరమైన క్షణాలు అప్పుడే అనుభవించానని పేర్కొన్నాడు. అలాగే, కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ చాలా భిన్నమైనదని కూడా పేర్కొన్నాడు. ఐదేళ్ల క్రితం స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షో 'కాఫీ విత్ కరణ్'లో పాల్గొన్నారు. ఆ సమయంలో వారు మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
వీరిద్దరిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు ప్లేయర్లకు రూ. 20 లక్షల జరిమానా విధించింది. అంతటితో ఆగకుండా వీరిని భారత జట్టు నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఇదే విషయాన్ని తాజాగా ఒక కార్యక్రమంలో ప్రస్తావించిన కేఎల్ రాహుల్ ఆ టాక్ షో పాల్గొన్న తర్వాత కొన్ని రోజులు తన జీవితంలో అత్యంత బాధకరమైనవిగా మారాయాని తెలిపాడు. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడూ కూడా అలా సస్పెండ్ అవ్వలేదన్నాడు. స్కూల్ డేస్ లో కూడా తనను ఎప్పుడు సస్పెండ్ చేయలేదనీ, అందువల్ల భారత క్రికెట్ జట్టు నుంచి తన సస్పెన్షన్ ను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలియదని వివరించాడు.
undefined
క్రికెట్‌లో రేర్ రికార్డు.. ప్రపంచంలో ఈ ముగ్గురు బౌలర్లకు మాత్రమే సాధ్యమైంది !
అందుకే ఆ రోజులు తనకు చాలా భయాన్ని, బాధను కలిగించాయని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. అయితే, 2019 ప్రారంభంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షోలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు కేల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఈ షోపై పాండ్యా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిద్దరికీ జరిమానా విధించడంతో పాటు సస్పెన్షన్ విధించారు. రాహుల్ స్వయంగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనప్పటికీ, అతని ప్రతిస్పందనలు పాండ్యా ఆలోచనలకు మద్దతుగా ఉండటంతో ఇద్దరిపై వేటు పడింది. కొన్ని నెలల తర్వాత ఇద్దరు జట్టులోకి వచ్చినప్పటికీ తనను చాలా బాధించిందని కేఎల్ రాహుల్ అన్నాడు.
నిఖిల్ కామత్ యూట్యూబ్ ఛానెల్లో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. 'కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ పూర్తిగా భిన్నమైన ప్రపంచం. అది నన్ను మార్చేసింది. నేను చాలా సిగ్గుపడే, మృదువుగా మాట్లాడే అబ్బాయిని. ఆపై భారత్ తరఫున ఆడాను, ఆ తర్వాత మూడు నాలుగేళ్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఆడాను. పెద్ద సమూహంగా ఉండటానికి నాకు ఎటువంటి సమస్య లేదు. నేను 100 మందితో ఒక గదిలో ఉన్నానని ప్రజలకు తెలుసు, ఎందుకంటే నేను అందరితో మాట్లాడతాను. ఇప్పుడు నేను చేయను, ఎందుకంటే ఇంటర్వ్యూ నన్ను తీవ్రంగా బాధించింది. జట్టు నుంచి సస్పెన్షన్ కు గురయ్యాను. నన్ను పాఠశాలలో ఎప్పుడూ సస్పెండ్ చేయలేదు, ఎప్పుడూ శిక్షించలేదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు' అని కేఎల్ రాహుల్ అన్నాడు. కాగా, ఆ వివాదాస్పద 'కాఫీ విత్ కరణ్' ఎపిసోడ్ లో సంబంధాలు, క్రష్ ల గురించి విచ్చలవిడిగా చర్చలు జరిగాయి. దీంతో వివాదం చెలరేగింది.
భారత క్రికెట్ లో అత్యంత దురదృష్టవంతులు.. ఒకే మ్యాచ్ తో కెరీర్ ను ముగించింది వీరే
Rahul said "Koffee with Karan interview scarred me massively - getting suspended from the team - I have never been suspended in school or punished - I don't know how to handle it - I did mischief in school but nothing to get me expelled or called my parents". [Nikhil Kamath YT] pic.twitter.com/DYUXXZgO2M
— Johns. (@CricCrazyJohns)