కోహ్లీ దెబ్బకు సచిన్ సెంచరీల రికార్డ్ బద్దలు

By Arun Kumar PFirst Published Aug 13, 2019, 3:46 PM IST
Highlights

వెస్టిండిస్ పై సాధించిన అద్భుత సెంచరీ ద్వారా కెప్టెన్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ పేరిట వున్న సెంచరీల రికార్డును కోహ్లీ  బద్దలుగొట్టాడు. 

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వెస్టిండిస్ గడ్డపై చెలరేగుతున్నాడు. ఇప్పటికే అతడి సారథ్యంలోని భారత జట్టు టీ20 సీరిస్ ను క్లీన్ స్వీప్ చేయగా వన్డే సీరిస్ కూడా అదేదిశగా సాగుతోంది. రెండో వన్డేలో కోహ్లీ(120 పరుగులు) అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఇలా సారథిగా జట్టు గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకోవడంతో పాటు వ్యక్తిగతంగా కూడా అతడు అనేక రికార్డులు నెలకొల్పాడు. 

కోహ్లీ ఇప్పటికే ఆస్ట్రేలియా,  శ్రీలంక  జట్లపై ఎనిమిదేసి సెంచరీలు సాధించాడు. తాజాగా వెస్టిండిస్ పై కూడా అతడి సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం విండీస్ తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 120 పరుగులతో చెలరేగాడు. ఇలా మూడు అంతర్జాతీయ జట్లపై ఎనిమిది సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 

గతంలో ఈ రికార్డు టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట వుండేది. అతడు ఆస్ట్రేలియా, శ్రీలంకలపై ఎనిమిది కంటే ఎక్కువ శతకాలు బాదాడు. కానీ కోహ్లీ మూడు జట్లపై ఈ ఘనత సాదించి సచిన్ ను వెనక్కునెట్టాడు. ఇలా కోహ్లీ అత్యధిక అంతర్జాతీయ జట్లపై ఎనిమిది కంటే ఎక్కువ శతకాలు బాదగా ఆ తర్వాతి  స్థానంలో సచిన్ నిలిచాడు.  

ఈ వన్డేకు కు ముందు జరిగిన టీ20 సీరిస్ లోనూ కోహ్లీ అదరగొట్టాడు. మూడో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించి ఓపెనర్ రోహిత్ పేరిట వున్న  అత్యధిక అర్థ శతకాల రికార్డును సమం చేశాడు. అలాగే రెండో వన్డేలో సెంచరీ ద్వారా విండీస్ పై అత్యధిక పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ నిలిచాడు. అలాగే కరీబియన్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు(120) సాధించిన ఏకైక కెప్టెన్ గా మరో రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇదే సెంచరీ ద్వారా సచిన్ రికార్డును కూడా కోహ్లీ బద్దలుగొట్టాడు.. 

 వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించినా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో భారత్‌ కు విజయం వరించింది. బౌలింగ్ లో భువనేశ్వర్‌ (31/4) విజృంభించడంతో  పాటు  కోహ్లీ 120, శ్రేయస్‌ అయ్యర్‌ 71పరుగులు సాధించి టీమిండియాను గెలిపించారు. 

సంబంధిత వార్తలు

రికార్డుల రారాజు.... 26ఏళ్ల రికార్డ్ ని బ్రేక్ చేసిన కోహ్లీ

ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు: గంగూలీని వెనక్కినెట్టి, సచిన్‌కి గురిపెట్టిన కోహ్లీ

ఆల్ టైం టీ20 క్రికెట్ టీం... ధోనీకి దక్కిన చోటు, కోహ్లీకి నో

మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. 19 పరుగులు చేస్తే 26 ఏళ్ల రికార్డు బద్ధలే

click me!