2028 ఒలింపిక్స్‌లో క్రికెట్: ఐసీసీ కసరత్తు, త్వరలో స్పష్టత

By Siva KodatiFirst Published Aug 13, 2019, 1:38 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు పడిచచ్చిపోయే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని ఎంతోమంది కల. కానీ అది దశాబ్ధాలుగా కార్యరూపం దాల్చడం లేదు. అయితే 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టే అంశంపై మెరిల్‌బోన్ క్రికెట్ కమిటీ సమావేశంలో చర్చించినట్లు కమిటీ ఛైర్మన్ మైక్ గాటింగ్ తెలిపారు. ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించాలి అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించామని, అన్ని కుదిరితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌నే చూస్తామన్నారు. ఈ అంశంపై ఐసీసీ సీఈవో మను సాహ్నేతో మాట్లాడామని.. రాబోయే 18 నెలల్లో దీనిపై ఒక స్పష్టత వస్తుందని గాటింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ అనుబంధ సంస్ధ.. జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ పరిధిలోకి బీసీసీఐ రావడం కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశానికి మార్గం సుగమమైనట్లేనని పలువురు భావిస్తున్నారు. ఒలింపిక్స్ నిబంధనలు ప్రకారం.. ప్రపంచంలోని అన్ని క్రీడా సమాఖ్యలు అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ పరిధిలోకి రావాల్సి వుంటుంది. 

click me!