ఒకే ఇన్నింగ్స్ లో ఐదు ప్రపంచ క్రికెట్ రికార్డులు బ్రేక్ చేసిన టీమిండియా

By Mahesh Rajamoni  |  First Published Oct 1, 2024, 1:25 PM IST

IND vs BAN : కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో భారత్ రికార్డుల మోత మోగించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇంగ్లాండ్ రికార్డును బ్రేక్ చేసింది. దీంతో పాంటు మ‌రో ఐదు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది భార‌త్. 
 


India Test cricket records : బంగ్లాదేశ్ తో జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ రికార్డుల మోత మోగించింది. ఒకే ఇన్నింగ్స్ తో ప్ర‌పంచ టెస్టు క్రికెట్ లో భార‌త్ దుమ్మురేపే రికార్డులను సాధించింది. కాన్పూర్ వేదిక‌గా, భార‌త్-బంగ్లాదేశ్ మ‌ధ్య రెంటో టెస్టు మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ ప్రారంభ రోజు వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యం అయింది. ఇక రెండో రోజు, మూడో రోజు వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ కొన‌సాగ‌లేదు. అయితే, నాల్గ‌వ రోజు, ఐదో రోజు మ్యాచ్ కొన‌సాగింది. నాల్గో రోజు భార‌త్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో టెస్టు క్రికెట్ లో టీ20 క్రికెట్ ఆట‌ను చూపించింది. ఈ క్ర‌మంలోనే ప‌లు రికార్డుల‌ను న‌మోదుచేసింది. 

 

అత్య‌ధిక సిక్స‌ర్ల ఇంగ్లాండ్ రికార్డును బ్రేక్ చేసిన భార‌త్ 

Latest Videos

undefined

 

రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ల అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాల‌తో భార‌త్ మొద‌టి నుంచి దూకుడుగా బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డింది. టీమిండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 4వ రోజు ఈ ఏడాది 90వ టెస్టు సిక్స్‌ను సాధించింది. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇంగ్లాండ్‌ను భార‌త్ జట్టు అధిగమించింది. ఇంగ్లండ్ 2023లో కేవలం 29 ఇన్నింగ్స్‌లలో 89 సిక్సర్లతో టెస్టు క్రికెట్ లో ఒక ఏడాదిలో అత్య‌ధిక సిక్స‌ర్ల రికార్డును న‌మోదుచేసింది. ఇప్పుడు భార‌త్ ఈ ఏడాది 90+ సిక్సర్లతో టాప్ లోకి చేరింది. అలాగే, న్యూజిలాండ్ సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత్ త్వరలో 100 సిక్సర్ల మార్క్‌ను అధిగమించే సూప‌ర్ రికార్డుకు చేరువ‌లో ఉంది. 

 

టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100 సాధించిన భార‌త్ 

 

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతమైన ధ‌నాధ‌న్ బ్యాటింగ్ ప్రదర్శనలో భారత్ కొత్త రికార్డులను సాధించింది. వారి దూకుడు ఆట కారణంగా భారత్ కేవలం 10.1 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. దీంతో టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచ‌రీ ప‌రుగుల‌ను సాధించిన జ‌ట్టుగా భార‌త్ ఘ‌న‌త సాధించింది. దీనికి ముందు భారత్ ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ప‌రుగుల రికార్డును కూడా నమోదు చేసింది. వర్షం వరుసగా రెండు రోజుల ఆట ర‌ద్దు త‌ర్వాత నాల్గో రోజూ భార‌త్ ఈ రికార్డులు సాధించింది. అంతకుముందు బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. 

 

ఇంగ్లండ్‌ ఫాస్టెస్ట్ 50 రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన భార‌త్ 

 

టెస్టు క్రికెట్ లో అత్యంత వేగ‌వంత‌మైన 50 ప‌రుగుల రికార్డును జులైలో నెలకొల్పిన ఇంగ్లండ్ ను భారత్  అధిగ‌మించింది. ఇంగ్లాండ్ రికార్డును బ్రేక్ చేసిన భార‌త్ కేవ‌లం 18 బంతుల్లోనే జట్టు మొత్తం 50 పరుగులు దాటించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50 ప‌రుగులు సాధించిన జ‌ట్టుగా భార‌త్ నిలిచింది. టెస్ట్ క్రికెట్ లో మొదటి మూడు ఓవర్లలోనే భార‌త్ 50 పరుగులు చేసింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 50 పరుగులకు చేరుకోవడానికి 4.2 ఓవర్లు తీసుకుంది. 

 

టెస్టుల్లో అత్యంత వేగవంతమైన 100 ప‌రుగులు చేసిన జట్టుగా భార‌త్ 

 

మెహిదీ హసన్ నాల్గో ఓవర్లో రోహిత్ మెరుపులను ముగించినప్పటికీ య‌శ‌స్వి జైస్వాల్  తన దూకుడును కొన‌సాగించాడు. వీరిద్దరు కేవలం 10.1 ఓవర్లలోనే భారత్‌ను 100 పరుగులకు చేర్చడంతో వారికి ఆ త‌ర్వాత‌ శుభ్‌మన్ గిల్ జతకలిశాడు.  దీంతో టెస్టులో వేగంగా 100 ప‌రుగులు చేసిన జ‌ట్టుగా భార‌త్ ఘ‌న‌త సాధించింది. అంతకుముందు, 2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై 12.2 ఓవర్లలో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టు రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 

 

 

టెస్టుల్లో అత్యంత వేగంగా 200 ప‌రుగులు చేసిన జట్టుగా భార‌త్

 

కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 4వ రోజు, భారత్ టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది అంత‌క‌ముందు, వేగంగా 50, 100, 150 ప‌రుగుల రికార్డును భార‌త్ న‌మోదుచేసింది. రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్‌ల దూకుడు బ్యాటింగ్ తో భార‌త్ ఈ కొత్త రికార్డును నెలకొల్పింది. భారత ద్వయం రోహిత్ శర్మ-యశస్వి జైస్వాల్ తమ ఇన్నింగ్స్‌ను బ్యాంగ్‌తో ప్రారంభించి కేవలం మూడు ఓవర్లలో 50 పరుగులను సాధించారు. ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టు కేవలం 61 బంతుల్లో (10.1 ఓవర్లు) 100 పరుగులకు చేరుకుంది.

దీని త‌ర్వాత టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులతో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన 200 ప‌రుగుల రికార్డును కూడా భార‌త్ సాధించింది. టీమిండియా  కేవలం 24.2 ఓవర్లలో 200 పరుగుల మార్కును చేరుకుంది. 2017లో సిడ్నీలో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్‌తో జరిగిన 28.1 ఓవర్ల తర్వాత ఒక జట్టు టెస్టుల్లో 200 పరుగులకు చేరిన వేగవంతమైన స్కోరు ఇదే. ఆ త‌ర్వాత భార‌త్ టెస్టు క్రికెట్ లో ఫాస్టెప్ట్ 250 ప‌రుగుల రికార్డును కూడా న‌మోదుచేసింది.

click me!