Tanmay Agarwal: హైదరాబాద్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొదట రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని సాధించిన అతను.. కొంత సమయం తర్వాత దానిని ట్రిపుల్ సెంచరీగా మార్చాడు. తన్మయ్ అగర్వాల్ కేవలం 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు.
Tanmay Agarwal: ఐదు టెస్టు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల హైదరాబాద్ వేదికగా మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు ముందు బాజ్ బాల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంగ్లాండ్ దూకుడు గేమ్ కు పేరుగాంచిన ఈ బాజ్ బాల్ ఆటను ఆడిన సరికొత్త చరిత్రను సృష్టించాడు హైదరాబాద్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ లోని నెక్స్ జెన్ క్రికెట్ గ్రౌండ్ లో ఆతిథ్య హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాట్స్ మన్ తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీగా తన్మయ్ అగర్వాల్ సాధించాడు. 119 బంతుల్లోనే డబుల్ సెంచరీతో రికార్డు నెలకొల్పగా, ఆ వెంటనే దాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆంధ్రతో జరిగిన ఈ మ్యాచ్ లో తన్మయ్ అగర్వాల్ కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ అగర్వాల్ కంటే ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా ప్రపంచ రికార్డు మార్కో మోరిస్ పేరిట ఉంది. అతను 191 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు తన్మయ్ అగర్వాల్ కేవలం 147 బంతుల్లోనే 200కు పైగా స్ట్రైక్ రేట్ తో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు.
undefined
ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికిపారేసిన కేఎల్ రాహుల్.. 50వ టెస్టులో 100 మిస్ !
తన్మయ్ అగర్వాల్ ఇన్నింగ్స్ లో బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు. 20 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే వరకు 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 323 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం అతని స్ట్రైక్ రేట్ 201.88గా ఉంది. తన ట్రిపుల్ సెంచరీని 400 పరుగులుగా మార్చడంలో అతను విజయవంతమైతే, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన అతికొద్ది మంది బ్యాటర్స్ సరసన నిలుస్తాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భారత్ నుంచి ఏ బ్యాట్స్ మన్ కూడా ఈ మైలురాయిని అందుకోలేదు. అత్యధిక స్కోరు పృథ్వీ షాదే. అతను 2023లో అస్సాంపై 379 పరుగులు చేశాడు.
Magnificent! 🤯
Hyderabad's Tanmay Agarwal has hit the fastest triple century in First-Class cricket, off 147 balls, against Arunachal Pradesh in the match 👌
He's unbeaten on 323*(160), with 33 fours & 21 sixes in his marathon knock so far 🙌 pic.twitter.com/KhfohK6Oc8
ఇంగ్లాండ్ పై రవీంద్ర జడేజా టాప్ క్లాస్ షో.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రెచ్చిపోయిన జడ్డూ !