ఇంగ్లాండ్ పై ర‌వీంద్ర జ‌డేజా టాప్ క్లాస్ షో.. ఆల్‌రౌండర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చిపోయిన జ‌డ్డూ !

By Mahesh Rajamoni  |  First Published Jan 26, 2024, 5:28 PM IST

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ మొద‌టి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భార‌త స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర‌ జ‌డేజా టాప్ క్లాస్ షోతో అద‌ర‌గొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ టీమ్ ను దెబ్బ‌కొట్టాడు.  


India vs England:టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఆల్ రౌండ‌ర్ న‌ని నిరూపించాడు.  భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతోంది. ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు తొలి ఇన్నింగ్స్ ర‌వీంద్ర‌ జ‌డేజా టాప్ క్లాస్ షోతో అద‌ర‌గొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ టీమ్ ను దెబ్బ‌కొట్టాడు. బౌలింగ్ లో మూడు వికెట్లు తీసుకోవ‌డంతో పాటు 18 ఓవ‌ర్ల‌లో 4 మేడిన్ ఓవ‌ర్లు వేశాడు. కీల‌క‌మైన ఒల్లీ పోప్, జోరూట్, టామ్ హార్ట్లీ వికెట్ల‌ను తీసుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్ మ‌న్ ను దెబ్బ‌కొట్టిన ర‌వీంద్ర జ‌డేజా.. బ్యాట్ తో రాణిస్తూ ఇంగ్లీష్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. త‌న టెస్టు కెరీర్‌లో 20వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి జ‌డేజా 81* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ 35 ప‌రుగులు చేసి పెవిలియన్ బాట పట్టడంతో రవీంద్ర జడేజా రంగంలోకి దిగాడు. జడేజా మొదట కేఎల్ రాహుల్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాహుల్ ఔట్ అయిన త‌ర్వాత శ్రీకర్ భరత్ తో కలిసి జడేజా టీమిండియా స్కోరును 350 దాటించాడు. ఆ త‌ర్వాత అక్ష‌ర్ ప‌టేల్ తో క‌లిసి భార‌త్ స్కోర్ ను 400 దాటించాడు. ప్ర‌స్తుతం జ‌డేజా 81* ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్ 35* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు.

Latest Videos

India vs England: ఇదిగో జైస్‌బాల్.. ! 'బాజ్‌బాల్' ఎక్కడ?

రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 7 వికెట్లు కోల్పోయి  421 ప‌రుగులు చేసింది. మొదట బౌలింగ్‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన చూసి ఇంగ్లిష్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కూడా జడ్డూకు ఫ్యాన్‌గా మారిపోయాడు. జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ అని వాన్ పేర్కొన్నాడు.

 

Stumps on Day 2 in Hyderabad! 🏟️ move to 421/7, lead by 175 runs 🙌

See you tomorrow for Day 3 action 👋

Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E | pic.twitter.com/sul21QNVgh

— BCCI (@BCCI)

ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికిపారేసిన కేఎల్ రాహుల్.. 50వ టెస్టులో 100 మిస్ ! 

click me!