T20 worldcup 2021: విజృంభించిన పాక్ బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన న్యూజిలాండ్...

Published : Oct 26, 2021, 09:17 PM ISTUpdated : Oct 26, 2021, 09:21 PM IST
T20 worldcup 2021: విజృంభించిన పాక్ బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన న్యూజిలాండ్...

సారాంశం

New Zealand vs Pakistan: నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసిన న్యూజిలాండ్... నాలుగు వికెట్లు తీసిన హారీస్ రౌఫ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన పాక్ బౌలర్లు, న్యూజిలాండ్ జట్టును కూడా స్పల్ప స్కోరుకే కట్టడి చేయగలిగారు. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ పాకిస్తాన్ జట్టుకి కలిసొచ్చింది. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది...

షాహీన్ ఆఫ్రిదీ వేసిన మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాలేదు. మెయిడిన్ ఓవర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్, ఓపెనర్లు మంచి ఆరంభమే అందించే ప్రయత్నం చేశారు. 20 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్‌ను హరీస్ రౌఫ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు...

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

మరో ఓపెనర్ డారిల్ మిచెల్ 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి ఇమాద్ వసీం బౌలింగ్‌లో ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు చేసిన జేమ్స్ నీశమ్, హఫీజ్ వేసిన మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

24 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన డివాన్ కాన్వేని రౌఫ్ అవుట్ చేయగా 26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన కెప్టెన్ కేన్ విలియంసన్ రనౌట్ అయ్యాడు...

Read this: ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం...

గ్లెన్ ఫిలిప్ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి అవుట్ కగా టిమ్ సిఫర్ట్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. 6 పరుగులు చేసిన మిచెల్ సాంట్నర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు... పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిదీ ఓ వికెట్ తీయగా, హరీస్ రౌఫ్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇమాద్ వసీం, హఫీజ్ చెరో వికెట్ తీశారు... 

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్... 

PREV
click me!

Recommended Stories

T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?