T20 worldcup 2021: న్యూజిలాండ్‌కి ఊహించని షాక్... గాయంతో స్టార్ పేసర్ దూరం...

Published : Oct 26, 2021, 08:46 PM ISTUpdated : Oct 26, 2021, 08:54 PM IST
T20 worldcup 2021: న్యూజిలాండ్‌కి ఊహించని షాక్... గాయంతో స్టార్ పేసర్ దూరం...

సారాంశం

T20 worldcup 2021: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న లూకీ ఫర్గూసన్... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొత్తానికి దూరం... ఫర్గూసన్ స్థానంలో ఆడమ్ మిల్నేకి అవకాశం... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్‌కి ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ లూకీ ఫర్గూసన్, గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు నెట్ సెషన్స్‌లో బౌలింగ్ చేసేందుకు లూకీ ఫర్గూసన్ ఇబ్బందిపడ్డాడు..

ఫర్గూసన్‌ని పరీక్షించిన వైద్యులు, స్కానింగ్ రిపోర్టుల ఆధారంగా అతను తోడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని, పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందని తేల్చారు... దీంతో లూకీ ఫర్గూసన్ లేకుండా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడనుంది న్యూజిలాండ్.

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌కి కూడా ఫర్గూసన్ అందుబాటులో ఉండడం అనుమానంగానే మారింది... పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్, ఆ తర్వాత ఇండియా, స్కాట్లండ్, నమీబియా, ఆఫ్ఘాన్‌లతో మ్యాచులు ఆడనుంది. కేవలం 13 రోజుల వ్యవధిలో కివీస్ మ్యాచులన్నీ జరగనున్నాయి..

లూకీ ఫర్గూసన్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో ఆడమ్ మిల్నేకి తుది 15 మంది జట్టులో చోటు కల్పించింది న్యూజిలాండ్ జట్టు. అయితే ఐసీసీ టెక్నకల్ కమిటీ, మిల్నే ఎంపికను పరీక్షించి, ఆమోదించాల్సి ఉంటుంది. 

Read this: ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం...

13 టీ20 మ్యాచుల్లో 24 వికెట్లు తీసిన లూకీ ఫర్గూసన్, ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన లూకీ ఫర్గూసన్, సెకండాఫ్‌లో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 8 ఐపీఎల్ మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన లూకీ ఫర్గూసన్, 7.4 ఎకానమీతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు...

లూకీ ఫర్గూసన్ స్థానంలో ఎంపికైన ఆడమ్ మిల్నే 23 మ్యాచుల్లో 28 వికెట్లు తీశాడు. మిల్నే ఎకానమీ 7.6గా ఉంది.  వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచి 21 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ సాధించింది న్యూజిలాండ్. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కూడా గెలవాలని భావిస్తోంది న్యూజిలాండ్..

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన మూడు రోజుల తర్వాత భారత్‌లో టీ20 సిరీస్ ఆడనుంది న్యూజిలాండ్ జట్టు. ఈ టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు జస్ప్రిత్ బుమ్రా, షమీ వంటి ప్లేయర్లు కూడా దూరంగా ఉంటారని సమాచారం..న్యూజిలాండ్ కీ ప్లేయర్లు కూడా భారత్‌లో జరిగే టీ20 సిరీస్‌కి దూరంగా ఉండే అవకాశం ఉంది. 

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్... 

PREV
click me!

Recommended Stories

T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్