టీ20 వరల్డ్‌కప్ 2021: హ్యాట్రిక్ కాదు, అంతకుమించి... నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు, ముగ్గురు డకౌట్...

By Chinthakindhi RamuFirst Published Oct 18, 2021, 4:55 PM IST
Highlights

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఐర్లాండ్ బౌలర్ కర్టీస్ కంపర్... రషీద్ ఖాన్, లసిత్ మలింగ తర్వాత ఈ ఫీట్ క్రియేట్ చేసిన మూడో బౌలర్‌గా గుర్తింపు...

టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫైయర్స్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. మొదటిరోజు టెస్టు హోదా ఉన్న బంగ్లాదేశ్, పసికూన స్కాట్లాండ్ చేతుల్లో ఓడగా... తాజాగా ఐర్లాండ్, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రేర్ హ్యాట్రిక్ నమోదైంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్, 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసి మంచి స్కోరు దిశగానే సాగుతున్నట్టు కనిపించింది. అయితే పదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన ఐర్లాండ్ బౌలర్ కర్టీస్ కంపర్ అద్భుతం చేశాడు. నాలుగు బంతుల్లో నాలుగు వరుస వికెట్లు తీసి, నెదర్లాండ్స్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

Must Read: టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...

మొదటి బంతి వైడ్ కాగా, ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు.  11 పరుగులు చేసిన అక్రేమ్యాన్‌ను ఓవర్ రెండో బంతికి అవుట్ చేసిన కర్టీస్ కంపర్, ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో ముగ్గురిని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. టెన్ డెస్చటే, స్కాట్ ఎడ్వర్డ్స్ ఇద్దరూ ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన వాన్ దేర్ మార్వేను క్లీన్‌బౌల్డ్ చేశాడు కంపర్...

టీ20 చరిత్రలో 2019లో ఐర్లాండ్‌పైన రషీద్ ఖాన్, అదే ఏడాది న్యూజిలాండ్‌పై లసిత్ మలింగ తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కర్టీస్.. ఇది టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నమోదైన రెండో హ్యాట్రిక్ కాగా ఐర్లాండ్‌కి ఇదే మొట్టమొదటిది. ఇంతకముందు 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్‌లీ, బంగ్లాపై హ్యాట్రిక్ తీశాడు. ఒకే మ్యాచ్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరడం కూడా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి...

ఇవీ చదవండి: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

 

click me!