VVS Laxman refuses BCCI’s offer: భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా పేరున్న మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐ ఇచ్చిన క్రేజీ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్ (VVS Laxman).. సింపుల్ గా చెప్పాలంటే వీవీఎస్ లక్ష్మణ్. తెలుగువాడు.. అందునా హైదరాబాదీ అయిన లక్ష్మణ్.. బారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇచ్చిన ఓ క్రేజీ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తున్నది. రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid).. భారత కోచ్ గా పగ్గాలు చేపట్టబోతున్న నేపథ్యంలో అతడి ప్రస్తుత పదవిలో లక్ష్మణ్ ను ఉంచాలని బీసీసీఐ భావించింది.
టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup 2021) తర్వాత భారత జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli).. టీ20 ఫార్మాట్ లో సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగనున్నాడు. ఇక టీమిండియా హెడ్ కోచ్ (Team India Head Coach) రవిశాస్త్రి (Ravi Shastri)తో పాటు సహాయక శిక్షణ సిబ్బంది కూడా తమ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. వీరి తర్వాత టీమిండియా (Team India Coach)కోచ్ పదవి చేపట్టేందుకు రాహుల్ ద్రావిడ్ సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా చకచకా సాగుతున్నది.
undefined
ఇది కూడా చదవండి: Virat Kohli: శిఖర్ ధావన్ ను ఇమిటేట్ చేసిన విరాట్ కోహ్లి.. వైరల్ అవుతున్న వీడియో
ఇదిలాఉండగా.. ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లనున్న నేపథ్యంలో అతడు ఇన్నాళ్లు సేవలందించిన జాతీయ క్రికెట్ అకాడమీ (National Cricket Academy-NCA)లో డైరెక్టర్ పదవి ఖాళీగా ఉండనున్నది. రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం గత నెలలోనే ముగిసింది. అయితే టీమిండియా కోచ్, సహాయక కోచ్ లతో పాటు ఎన్సీఏ డైరెక్టర్ పదవికి కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఈ పదవిని చేపట్టవలసిందిగా లక్ష్మణ్ ను బీసీసీఐ పెద్దలు కోరినట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆఫర్ ను లక్ష్మణ్ తిరస్కరించాడట. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా సేవలందిస్తున్న అతడు.. బెంగాల్ రంజీ టీమ్ కు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కూడా ఉన్నాడు. ఒకవేళ ఎన్సీఏ డైరెక్టర్ గా లక్ష్మణ్ ఎంపికైతే.. ఈ రెండు బాధ్యతల నుంచి అతడు తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ లక్ష్మణ్ మాత్రం ఇందుకు సిద్ధంగా లేడని తెలుస్తున్నది. తాను ఎస్ఆర్హెచ్ టీమ్ మెంటార్ గానే కొనసాగుతానని బీసీసీఐ పెద్దలకు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ద్రావిడ్.. ఏటా రూ. 7 కోట్ల సాలరీ పొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి:Hardik Pandya: అదే లేకుంటే ఇప్పటికి ఏ పెట్రోల్ బంకులోనో పనిచేసుకుంటూ ఉండేవాడిని.. పాండ్యా సంచలన కామెంట్స్
గతంలో ఎవరూ పెద్దగా పట్టించుకోని ఎన్సీఏ కు ద్రావిడ్ ఘనమైన కీర్తిని తెచ్చిపెట్టాడు. ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ నెగ్గడం.. శుభమన్ గిల్, పృథ్వీ షా, మహ్మద్ సిరాజ్, రిసభ్ పంత్ వంటి ఆటగాళ్లు ఎన్సీఏ నుంచి రావడంతో దాని విలువ అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడు ద్రావిడ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలుగుతుండటంతో ఆ బాధ్యతలు ఎవరు మోస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.