Virat Kohli: శిఖర్ ధావన్ ను ఇమిటేట్ చేసిన విరాట్ కోహ్లి.. వైరల్ అవుతున్న వీడియో

Published : Oct 18, 2021, 02:57 PM IST
Virat Kohli: శిఖర్ ధావన్ ను ఇమిటేట్ చేసిన విరాట్ కోహ్లి.. వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

Virat kohli imitates shikhar Dhawan: గ్రౌండ్ లో అగ్రెస్సివ్ గా ఉండే భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ఆఫ్ ది ఫీల్డ్ లో మాత్రం చాలా క్యాజువల్ గా ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా అతడు భారత ఓపెనర్ ధావన్ ను మిమిక్రీ చేశాడు. 

టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup2021) సన్నాహాల్లో బిజీగా ఉన్న భారత క్రికెట్ జట్టు (Team India) సారథి విరాట్ కోహ్లి (Virat Kohli).. వీలు చిక్కినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లోనూ మెరుస్తున్నాడు. తాజాగా అతడు తన సహచరుడు, భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ను ఇమిటేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. ఈ వీడియోను స్వయంగా కోహ్లినే తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

వీడియో లో కోహ్లి మాట్లాడుతూ.. ‘నేనిప్పుడు శిఖర్ ధావన్ ను అనుకరించబోతున్నాను. ప్రస్తుతం అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు. నేను చేయబోయే ఈ వీడియో ఫన్నీగా ఉంటుంది. దీనిని చూసి నేనే చాలా సార్లు నవ్వుకున్నాను’ అని అన్నాడు. 

 

 

వీడియోలో కోహ్లి.. అచ్చం శిఖర్ ధావన్ మాదిరిగానే నిల్చోవడం.. బ్యాటింగ్ శైలి.. బంతిని వదిలిపెట్టాక అతడి ముఖంలో కనిపించే హావభావాలు.. అచ్చు గుద్దినట్టు దింపాడు. ఈ వీడియోను కోహ్లి ట్విట్టర్ లో  పోస్టు చేయగానే పలువురు నెటిజన్లు స్పందించారు. కోహ్లిని ఒత్తిడి దూరం చేసే వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 

 

విరాట్ జట్టులో ఉంటే అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తాడని, అతడు టీమ్ లో ఉండే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. 

 

ఇక మరికొందరైతే కోహ్లి మల్టీ టాలెంటెడ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.  విరాట్ చాలా బాగా నటిస్తున్నాడని, బాలీవుడ్ లో ట్రై  చేయవచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. 

 

కోహ్లి.. ఇలా ఆటగాళ్లను ఇమిటేట్ చేయడం ఇదే కొత్తకాదు. ఇంతకుముందు అతడు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ తో పాటు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ను కూడా ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

'మాకు డబ్బులు లేవు సార్'.. టాప్ కుర్రోళ్లపైనే ముంబై టార్గెట్..
RCB పక్కా టార్గెట్ వీరే.! ప్రతీ సెట్‌లోనూ ఈ ప్లేయర్స్‌పై కన్ను.. ఎవరెవరంటే.?