పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని అలా పిలుస్తూ అభిమానుల గోల... సానియా మీర్జా రియాక్షన్ చూస్తే...

By Chinthakindhi RamuFirst Published Oct 26, 2021, 4:03 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ భారత్, పాక్ మ్యాచ్ సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మాలిక్‌ని ‘జీజా జీ’ అంటూ గోల చేసిన అభిమానులు... వీడియోపై స్పందించిన సానియా మీర్జా...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కి భిన్నమైన అనుభూతులను మిగిల్చింది. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుపై దక్కిన మొట్టమొదటి విజయాన్ని ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు పాకిస్తానీలు. ఇన్నాళ్లు ‘మోకా... మోకా’ అంటూ పాకిస్తాన్‌ను హేళన చేసిన టీమిండియా ఫ్యాన్స్‌పై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నారు...

అయితే ఈ మ్యాచ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది భారత జట్టు.  ఈ సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేశాడు షోయబ్ మాలిక్...

 

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

ఈ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కొందరు... ‘జీజా జీ...’ అంటూ పిలుస్తూ, షోయబ్ మాలిక్‌ని ఆట పట్టించారు. ఇలా పిలిచిన వారిలో చాలామంది పాకిస్తానీలే ఉండడం విశేషం. అయితే సానియా మీర్జా భారతీయురాలు రావడంతో, షోయబ్ మాలిక్‌ని ఇండియన్ ఫ్యాన్స్‌ ‘జీజా... జీ (బావగారూ... ) అని పిలుస్తూ ఆట పట్టించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

🤣🤣❤️❤️ https://t.co/NE46xoSKfu

— Sania Mirza (@MirzaSania)


షోయబ్ మాలిక్ వీరాభిమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, షోయబ్ మాలిక్‌ని ట్యాగ్ చేశాడు. ‘మాలిక్ సాబ్... మీపై ఇంత ప్రేమా... ’ అంటూ కాప్షన్ జోడించాడు. ఈ వీడియోపై సానియా మీర్జా స్పందించింది.  పగలబడి నవ్వుతున్నట్టుగా రెండు ఎమోజీలను జోడించి, ఆ తర్వాత రెండు ప్రేమ చిహ్నాలను కామెంట్ చేసింది సానియా మీర్జా...

ఇవి కూడా చదవండి: ఇతన్నేనా మిస్టరీ స్పిన్నర్ అంటూ దాచారు, తనకంటే పదో క్లాస్ పిల్లలే నయం... పాక్ మాజీ పేసర్ కామెంట్స్...

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడల్లా కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండడం సానియాకి అలవాటు. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన తర్వాత సానియా మీర్జాని తీవ్రంగా ట్రోల్ చేస్తూ, ఆమెను పాకిస్తానీగా అభివర్ణిస్తూ దూషణలు చేసేవాళ్లు నెటిజన్లు. భారత్‌లో 120 కోట్ల మంది జనాభా ఉంటే, పెళ్లి చేసుకోవడానికి పాకిస్తానీయే దొరికాడా? అంటూ కామెంట్లు చేసేవాళ్లు.

అయితే వాటిని పట్టించుకోని సానియా, పెళ్లైనా తాను భారతీయురాలిననే, సగర్వంగా ఇండియా తరుపున ఆడతానని స్పష్టం చేసింది. బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన సానియా మీర్జా, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లో ఓడిన విషయం తెలిసిందే. 2010లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహం జరగగా, 11 ఏళ్లుగా వీరి కాపురం సజావుగా సాగుతోంది.

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్... 

నీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం, కావాలని పాక్‌ని గెలిపించావ్... టీమిండియా ఓటమి తర్వాత మహ్మద్ షమీపై తీవ్రమైన...

click me!