T20 worldcup 2021: బోణీ కొట్టిన ఇంగ్లాండ్... వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో...

By Chinthakindhi RamuFirst Published Oct 23, 2021, 9:58 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ: 56 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... బట్లర్, మోర్గాన్ ఇన్నింగ్స్ కారణంగా 6 వికెట్ల తేడాతో విజయం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మాజీ రన్నరప్ ఇంగ్లాండ్ జట్టు బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి మంచి విజయంతో టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ప్రారంభించింది ఇంగ్లాండ్... 56 పరుగుల టార్గెట్‌ ఛేదనలో తొలి వికెట్‌కి 21 పరుగుల భాగస్వామ్యం దక్కింది.

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన జాసన్ రాయ్, రవిరాంపాల్ బౌలింగ్‌లో క్రిస్ గేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... ఆ తర్వాత 6 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

మొయిన్ ఆలీ 3 పరుగులు చేసి రనౌట్ కావడంతో 36 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. ఆ తర్వాత లివింగ్‌స్టోన్‌ని కూడా అకీల్ హుస్సేన్ అద్భుతమైన క్యా,చ్‌తో పెవిలియన్ చేర్చాడు... జోస్ బట్లర్ 24 పరుగులు, మోర్గాన్ 7 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు.

Must READ: T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 55 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 13 పరుగులు చేసిన క్రిస్ గేల్ మినహా, విండీస్ బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు... 

స్లో పిచ్ మీద బ్యాటింగ్‌కి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు కొట్టాలని ప్రయత్నించడంతో ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాలేదు. 6 పరుగులు చేసిన ఇవిన్ లూయిస్‌ను క్రిస్ వోక్స్ అవుట్ చేయగా, సిమ్మన్స్ 7 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 9 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది వెస్టిండీస్..

READ also: హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌తో విండీస్ క్రికెటర్ క్రిస్‌ గేల్... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి రెండ్రోజుల ముందు...

మొయిన్ ఆలీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన సిమ్రన్ హెట్మయర్... మరో భారీ షాట్‌కి ప్రయత్నించి మోర్గాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  13 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన క్రిస్ గేల్, తైమల్ మిల్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన డ్వేన్ బ్రావో 5 పరుగులు, నికోలస్ పూరన్ 9 బంతుల్లో 1 పరుగు చేసి పెవిలియన్ చేరగా డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్‌ను అదిల్ రషీద్ డకౌట్ చేశాడు. పోలార్డ్ 6 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికే మెక్‌కాయ్ కూడా అవుట్ అయ్యాడు. 

ఇవీ చదవండి: T20 worldcup 2021: మెంటర్ చేసేదేమీ లేదు, చేయాల్సిందంతా ప్లేయర్లే... సునీల్ గవాస్కర్ కామెంట్...

టీ20 చరిత్రలో వెస్టిండీస్‌కి ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు ఇంగ్లాండ్‌పైనే 2019లో 45 పరుగులకి ఆలౌట్ అయ్యింది వెస్టిండీస్.. అదిల్ రషీద్ 2 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి, టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 
 

click me!