T20 World Cup: అమెరికాలో టీమిండియా ప్రకంపనలు.. రికార్డులు బద్దలయ్యాయి..

By Mahesh Rajamoni  |  First Published Jun 12, 2024, 12:42 AM IST

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో హై వోల్టేజీ మ్యాచ్ ఆదివారం (జూన్ 9) భారత్-పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిసారిగా అమెరికాలో ఐసీసీ ఈ టోర్నీని నిర్వహిస్తోంది.
 


T20 World Cup 2024 : మొద‌టిసారి అమెరికాలో జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ క‌ప్ అయిన‌ప్ప‌టికీ అక్క‌డ క్రికెట్ ల‌వ‌ర్స్ నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో హై వోల్టేజీ మ్యాచ్ ఆదివారం (జూన్ 9) భారత్-పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అమెరికా ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. మ‌రోసారి దాయాదుల పోరులో మ‌రో పెద్ద క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పించింది. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అమెరికాలో నివసిస్తున్న ప్రజలకు చిరస్మరణీయ క్ష‌ణాల‌ను అందించింది.

పాకిస్థాన్‌పై భారత్ కు 7వ గెలుపు

Latest Videos

అమెరికాలో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి తలపడ్డాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇది 8వ మ్యాచ్. టీమిండియా 7వ సారి విజయం సాధించింది. 2021లో మాత్రమే పాకిస్థాన్ విజయం సాధించింది. వన్డే లేదా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై సాధించిన ఏకైక విజయం ఇదే. న్యూయార్క్‌లో తన రెండవ విజయాన్ని పొందే అవకాశంలో ఉన్న స‌మ‌యంలో భారత బౌలర్లు అద్భుతాలు చేసి మ్యాచ్‌ను గెలుచుకున్నారు.

న్యూయార్క్ స్టేడియానికి 34 వేల మందికి పైగా.. 

అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం ప్ర‌కారం.. భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ ఈ సంవత్సరం చూసిన అతిపెద్ద మ్యాచ్ గా రికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ను చూసేందుకు 34,000 మందికి పైగా అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఏ మ్యాచ్ అయినా చరిత్రాత్మకమే. చివరిసారిగా ఇరు జట్లు ఆడినప్పుడు ఒక్క భారతదేశంలోనే వీక్షకుల సంఖ్య 398 మిలియన్లకు (39.8 కోట్లు) చేరుకుంది. ఈ సంవత్సరం సూపర్ బౌల్ వీక్షించిన 123 మిలియన్ల (12.3 కోట్లు) కంటే ఇది చాలా ఎక్కువ. ఇక అమెరికాలో జరిగిన ఏ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లోనూ అత్యధిక మంది ప్రేక్షకులు (34,028) మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చారు.

T20 WORLD CUP 2024: పాకిస్తాన్ గెలిచినా సూపర్-8 చేరాలంటే టీమిండియానే దిక్కు.. !

click me!