Latest Videos

T20 World Cup 2024: పాకిస్తాన్ గెలిచినా సూపర్-8 చేరాలంటే టీమిండియానే దిక్కు.. !

By Mahesh RajamoniFirst Published Jun 11, 2024, 11:51 PM IST
Highlights

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు మంచి ప్ర‌ద‌ర్శ‌న చూపించ‌లేక పోయింది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై ఓడి.. రెండో మ్యాచ్ లో భారత్ చేతిలో చిత్తు అయింది. ఇప్పుడు బాబర్ అజామ్ జట్టు గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయ్యే అంచుకు చేరుకుంది.
 

T20 World Cup 2024 : దాయాది దేశం పాకిస్థాన్ గ్రూప్ ద‌శ‌లోనే టీ20 ప్రపంచకప్ 2024 నుంచి ఎలిమినేట్ అయ్యే ప‌రిస్థితుల్లోకి జారుకుంది. ఇప్పటివరకు త‌మ‌కు త‌గ్గ‌ట్టుగా మంచి ఆటను ప్రదర్శించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్ లోనూ భారత్ చేతిలో చిత్తు అయింది. ఇప్పుడు బాబర్ ఆజం జట్టు గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయ్యే అంచున ఉంది. మంగ‌ళ‌వారం కెనడాతో మూడో మ్యాచ్ లో గెలిచిన పాక్.. జూన్ 16న నాలుగో మ్యాచ్‌ను ఆడ‌నుంది. అయితే, పాకిస్తాన్ కెన‌డాపై గెలిచినా సూప‌ర్ 8 కు చేరాలంటే టీమిండియానే దిక్కుగా మారింది.

గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. భారత్ 2 మ్యాచ్‌ల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానం 4 పాయింట్లతో ఉంది. అమెరికా కూడా తన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 4 పాయింట్లు సాధించింది. అయితే, భార‌త్ నెట్ రన్ రేట్ +1.455 గా ఉండ‌గా, అమెరికా +0.626 ర‌న్ రేటుతో ఉంది. కెనడా 2 మ్యాచ్‌ల్లో 1 గెలిచి 2 పాయింట్లతో ఉంది. కెనడా నికర రన్ రేట్ 0.274. పాకిస్థాన్ కు ఒక విజ‌యంతో ఉండ‌గా, ఐర్లాండ్‌లకు ఒక్క విజయం కూడా దక్కలేదు.

పాకిస్థాన్ సూపర్-8 చేరుకోవాలంటే ఇలా జ‌ర‌గాలి?

మెగా టోర్నలో మొత్తం 20 జట్ల‌ను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి రెండేసి జట్లు సూపర్-8కి వెళ్తాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. గ్రూప్‌-ఏలో మూడో స్థానంలో ఉంది. అయితే, సూపర్-8పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే. అప్ప‌టికీ పక్కాగా సూప‌ర్ 8కు చేరుతుంద‌ని చెప్ప‌లేము. పెద్ద తేడాతో గెలవడంతో నెట్ రన్ రేట్‌ను మెరుగుప‌ర్చుకోవాలి. అప్ప‌టితో స‌రిపోదు.. భార‌త్ కూడా మ‌రో ప‌నిచేస్తేనే..

మిగిలిన 2 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ గెలిచినా సూపర్-8లో స్థానం ఖాయం కాదు. భార‌త్ నుండి కూడా ఫేవర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి, పాకిస్థాన్ జట్టు మిగిలిన త‌న ఒక మ్యాచ్‌లోనూ అమెరికాను ఓడించాలి. అలాగే, అమెరికా జట్టుపై భారత్ భారీ విజయాన్ని సాధించి ఆ జ‌ట్టు నెట్ రన్ రేట్‌ను త‌గ్గించ‌గ‌లిగితే పాకిస్తాన్ అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి.

అమెరికా ఓటమి కోసం పాక్ అభిమానుల ప్రార్థ‌న‌లు

భారత జట్టు అమెరికాను ఓడించడమే కాకుండా ఐర్లాండ్‌ను కూడా ఓడించాలని పాకిస్థాన్ కోరుకుంటోంది. భారత్ ఐర్లాండ్ కూడా ఓడిస్తే పాకిస్థాన్ లాభపడుతుంది. అటువంటి పరిస్థితిలో పాక్ సూప‌ర్ 8 అవ‌కాశాలు మ‌రింత మెరుగ‌వుతాయి.

click me!