టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మతిమరుపు మనిషని ఇటీవలే విరాట్ కోహ్లీ బయటపెట్టాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఆయన మతిమరుపు ప్రత్యక్షంగా బయటపడింది.
IND VS PAK : ఐసిసి టీ20 వరల్డ్ కప్ లోనే హైఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరిగింది. ఎప్పటిలాగే దాయాది పాక్ మరోసారి టీమిండియా చేతిలో ఓటమిని చవిచూసింది... కేవలం 120 పరుగుల టార్గెట్ ను కూడా చేధించలేకపోయింది. భారత బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు అద్భుతంగా ఆడారు...పాక్ టాపార్డర్ ను పేకమేడలా కుప్పకూల్చి అద్భుత విజయాన్ని అందించారు.
అయితే అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త మతిమరుపు మనిషని అందరికీ తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఏదో ఒకటి మరిచిపోతుంటారని...ఇలా ఫోన్, వ్యాలెట్, ఐప్యాడ్ పోగొట్టుకున్న సందర్భాలు వున్నాయట. ఇటీవల విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ మతిమరుపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓసారి రోహిత్ తన పాస్ పోర్ట్ ను కూడా మరిచిపోయాడని... కానీ ఎలాగోలా మళ్ళీ అది రోహిత్ చెంతకు చేరిందని కోహ్లీ వెల్డండించారు.
అయితే తాజాగా టీ20 వరల్డ్ కప్ లో అత్యంత కీలకమైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ మతిమరుపు బయటపడింది. ఈసారి మైదానంలోనే రోహిత్ మతిమరుపు బయటపడి ప్రత్యర్థి టీం కెప్టెన్ ముందు నవ్వులపాలయ్యాడు. రోహిత్ ను చూసి బాబర్ ఆజమ్ పగలబడి నవ్విన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐసిసి టీ20 వరల్ట్ కప్ టోర్నీలో భాగంగా అమెరికాలోని న్యూయార్స్ మైదానం భారత్, పాకిస్థాన్ అభిమానులతో నిండిపోయింది. ఈ సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు టాస్ కోసం మైదానంలోకి వచ్చారు... అయితే ముందుగానే టాస్ కాయిన్ తీసుకున్న రోహిత్ దాన్ని జేబులో వేసుకున్నారు. అయితే మైదానం మధ్యలో టాస్ వేసే ప్రాంతానికి చేరుకునేసరికి తనవద్ద కాయిన్ వుందన్న విషయాన్ని రోహిత్ మరిచాడు. సరిగ్గా టాస్ వేసే సమయంలో కాయిన్ ఎక్కడంటూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను అడిగాడు. చివరకు తనవద్దే కాయిన్ వుందని గుర్తించి జేబులోంచి తీసాడు.
టాస్ కాయిన్ జేబులోనే పెట్టుకున్న రోహిత్ ఎక్కడంటూ తనను అడగడంతో బాబర్ ఆజమ్ పక్కన నవ్వేసాడు. ఇలా రోహిత్ మతిమరుపు మ్యాచ్ ఆరంభంలో నవ్వులు పూయించింది. ఇలా రోహిత్ మతిమరుపుకు సంబంధించిన టాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.