
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాపై టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ల హాఫ్ సెంచరీల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో లిట్టన్ దాస్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేయడంతో బంగ్లా పులులు భారత శిబిరంలో గుబులు రేపారు.
7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసి బంగ్లాదేశ్ పటిష్ట స్థితిలో వుండగా.. వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. వర్షం నిలిచిన తర్వాత ఆట తిరిగి ప్రారంభం కాగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151గా తేల్చారు అంపైర్లు. అయితే బ్రేక్ సమయంలో బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ అంపైర్‌తో ఏదో సీరియస్‌గా చర్చలు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. ‘‘డీఎల్ఎస్ లక్ష్యంపై చర్చ’’ అన్న క్యాప్షన్ ఇచ్చింది.
Also REad:కేఎల్ రాహుల్ అద్భుతమైన త్రో.. రనౌట్ కావడంతో లిట్టన్ దాస్ షాక్.. కళ్లతో ఉరిమి చూసిన వీడియో వైరల్
అంతకుముందు తనకు బాగా అచ్చొచ్చిన అడిలైడ్ ఓవల్‌లో విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌పై క్లాసిక్ ఆట ఆడాడు. 64 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. పెర్త్‌తో పోలిస్తే ఈ పిచ్ చాలా నెమ్మదిగా వుంది. కేఎల్ రాహుల్ కూడా అర్ధ సెంచరీ చేసి ఫామ్‌లోకి రావడంతో బంగ్లాదేశ్ బౌలింగ్ అటాక్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈరోజు ఆటలో కోహ్లీ రెండు విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఒకటి కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మూడు వికెట్‌కు 38 పరుగులు జోడించాడు.