T20 World Cup: 39 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించిన భారత్.. నెట్ రన్‌రేట్ మాములుగా పెరగలేదుగా..

Published : Nov 06, 2021, 12:32 PM IST
T20 World Cup: 39 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించిన భారత్.. నెట్ రన్‌రేట్ మాములుగా పెరగలేదుగా..

సారాంశం

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా..  నెట్ రన్ రేట్ (Net Run-Rate) -1.609కు పడిపోయింది. అయితే అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్‌లపై విజయాల తర్వాత నెట్ రన్‌ రేట్ భారీగా పెరిగింది.

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) భాగంగా శుక్రవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించారు. తొలతు అద్భుతమైన బౌలింగ్‌తో 85 పరుగులకే స్కాట్లాండ్‌ను అలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా రాణించింది. 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 39 బంతుల్లోనే (6.3 ఓవర్లు) చేధించింది. కేఎల్ రాహుల్ (50), రోహిత్ శర్మ (30) చెలరేగి ఆడారు. దీంతో భారీగా నెట్‌ రన్‌ రేట్ (NRR) సాధించి.. సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధించి, 8వ తేదీన భారత జట్టు నమీబియాపై విజయం సాధిస్తే.. టీమిండియా సెమీ ఫైనల్స్‌కు వెళ్లేందుకు ఈ నెట్ రన్‌ రేట్ ఎంతగానో దోహదం చేస్తుంది. 

Also read: T20 worldcup:ఆదివారం మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి.. విరాట్ కోహ్లీ

ఇంత నెట్ రన్‌రేట్ ఎలా వచ్చింది..
ఈ టోర్నిలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా..  Net Run-Rate కూడా భారీగా పడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లో పరాజయం తర్వాత టీమిండియా నెట్ రన్‌రేట్.. -1.609కు తగ్గింది. అయితే అఫ్గానిస్తాన్‌పై విజయంతో టీమిండియా నెట్‌ రన్‌రేట్ పెరిగింది. ఆ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా నెట్ రన్‌ రేట్.. +0.073కి చేరింది. అయితే స్కాట్లాండ్‌పై విజయం సాధించిన అనంతరం టీమిండియా NRR భారీగా పెరిగింది. నెట్ రన్‌రేట్ +1.619కి పెరగడంతో.. గ్రూప్‌ 2లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న టీమిండియా.. అత్యధిక నెట్ రన్‌రేట్ కలిగిన జట్టుగా ఉంది. 

Also Read: T20 Worldcup 2021: దంచికొట్టిన భారత బ్యాట్స్‌మెన్... దుమ్మురేపిన టీమిండియా...

టీమిండియా సెమీస్ అవకాశాలు..
ప్రస్తుతం గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ జట్టు సెమీస్‌ బెర్త్ కన్‌ఫామ్ చేసుకుంది. అయితే మరో స్థానం కోసం టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ జట్లు పోటి పడుతున్నాయి. గ్రూప్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 గెలుపొందిన పాకిస్తాన్.. 8 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక, న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు నెట్ రన్‌ రెట్ +1.277గా ఉంది. రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించిన టీమిండియా +1.619తో మూడో స్థానంలో ఉంది. అఫ్గానిస్తాన్ కూడా రెండు మ్యాచ్‌లో విజయం సాధించి.. 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ.. +1.481 NRR టీమిండియా కంటే తక్కువగా ఉండటంతో గ్రూప్‌లో 4వ స్థానంలో కొనసాగుతుంది. 

Also Read: Virat Kohli Birthday : క్యాండిల్ ఊదడం మర్చిపోయి కేక్ కట్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..!

ఇక, భారత జట్టు సెమీస్‌కు చేరాలంటే.. ఆదివారం న్యూజిలాండ్‌పై అఫ్గాన్ జట్టు విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా 8వ తేదీన నమీబియాపై భారత జట్టు గెలుపొందాలి. ఈ రెండు జరిగితే నెట్ రన్‌ రేట్ అధికంగా ఉండటంతో భారత్‌కు సెమీస్‌లో బెర్త్ లభిస్తుంది.

ఆదివారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అఫ్గాన్ గెలిచి.. నమీబియాపై ఇండియా ఓడిపోతే.. అఫ్గాన్ జట్టుకు సెమీస్‌‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం నెట్ రన్‌రేట్ పరంగా న్యూజిలాండ్ కన్నా అఫ్గానిస్తాన్ మెరుగైన స్థితిలో ఉంది. ఇలా కాకుండా ఆదివారం మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై న్యూజిలాండ్ నెగ్గితే.. 8 పాయింట్లతో సెమీస్‌కు బెర్త్ ఖాయం చేసుకుంటుంది. దీంతో ఆదివారం జరిగనే మ్యాచ్ అఫ్గానిస్తాన్ విజయం సాధించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !