T20 World Cup: ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ కెప్టెన్ గా బాబర్.. ఇండియన్ క్రికెటర్లకు దక్కని చోటు..!

Published : Nov 16, 2021, 09:45 AM IST
T20 World Cup:   ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ కెప్టెన్ గా బాబర్.. ఇండియన్ క్రికెటర్లకు దక్కని చోటు..!

సారాంశం

బాబర్ ను ఐసీసీ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేయడం పట్ల పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. బాబర్ అందుకు అర్హుడేనని పేర్కొన్నారు.

టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఈ సమరంలో.. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ ని మట్టి కరిపించి.. 8 వికెట్ల తేడాతో.. ఆస్ట్రేలియా కప్ గెలిచింది. కాగా.. ఈ వరల్డ్ కప్ సిరీస్ ముగిసిన తర్వాత.. ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ను ప్రకటించింది. ఈ జట్టుకు పాక్ సారథి బాబర్ అజామ్ ను కెప్టెన్ గా పేర్కొంది. మొత్తం 6 జట్ల ఆటగాళ్లు ఈ ఐసీసీ జట్టులో స్థానం దక్కించుకోగా, టీమిండియా నుంచి ఏ ఒక్క ఆటగాడు ఈ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు.

Also Read:చిక్కుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఎయిర్ పోర్టులో ఐదుకోట్ల విలువైన లగ్జరీ వాచ్ లు సీజ్

బాబర్ ను ఐసీసీ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేయడం పట్ల పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. బాబర్ అందుకు అర్హుడేనని పేర్కొన్నారు.

కాగా ఐసీసీ తాజా జట్టుకు 12వ ఆటగాడిని కూడా ఎంపిక చేశారు. టీమిండియా ఆటగాళ్లలో ఏ ఒక్కరినీ కనీసం 12వ ఆటగాడినూ పరిగణనలోకి తీసుకోలేదు.

Also Read: అవును, అతనలా అనడం నేను విన్నా... మైకల్ వాగన్‌‌పై జాతివివక్ష ఆరోపణలపై అదిల్ రషీద్ స్టేట్‌మెంట్...

ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ టీమ్ వివరాలు...

బాబర్ అజామ్ (కెప్టెన్, పాకిస్థాన్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), జోస్ బట్లర్ (వికెట్ కీపర్, ఇంగ్లండ్), చరిత్ అసలంక (శ్రీలంక), ఐడెన్ మార్ క్రమ్ (దక్షిణాఫ్రికా), మొయిన్ అలీ (ఇంగ్లండ్), వనిందు హసరంగ (శ్రీలంక), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), జోష్ హేజెల్ వుడ్ (ఆస్ట్రేలియా), ఆన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), 12వ ఆటగాడు: షహీన్ అఫ్రిది (పాకిస్థాన్).

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !