T20 World Cup 2024: అమెరికాపై గెలుపు.. సూప‌ర్-8 చేరిన టీమిండియా

Published : Jun 12, 2024, 11:43 PM IST
T20 World Cup 2024: అమెరికాపై గెలుపు.. సూప‌ర్-8 చేరిన టీమిండియా

సారాంశం

IND vs USA T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 25వ మ్యాచ్‌లో అమెరికాపై భార‌త్ విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సూప‌ర్ 8కు చేరుకుంది. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్ దీప్ సింగ్ సూప‌ర్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.   

IND vs USA T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 25వ మ్యాచ్ లో భారత్-అమెరికాలు త‌ల‌ప‌డ్డాయి.  ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాద‌వ్ మెరుపులు మెరిపించ‌డంతో అమెరికాపై భార‌త్ సూప‌ర్ విక్ట‌రీని అందుకుంది. గెలుపుతో టీమిండియా గ్రూప్ ఏ నుంచి సూప‌ర్-8 కు అర్హ‌త సాధించింది. 7 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జ‌ట్టును భార‌త బౌల‌ర్లు చెడుగుడు ఆడుకున్నారు. అమెరికా స్కోర్ బోర్డును 110 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు.

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేట్ 1 వికెట్ పడగొట్టారు. మిగతా బౌలర్లు కూడా పెద్దగా పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేశారు. 20 ఓవర్లలో అమెరికా 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. 111 పరుగుల విజయ లక్ష్యంతో టీం ఇండియా ఛేజింగ్ ను కొనసాగించింది. ఆరంభంలోనే భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండా ఔట్ అయ్యారు.

జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ ఆడుతూ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

విరాట్ కోహ్లీ గోల్డెన్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ కు చేర‌గా, రోహిత్ శ‌ర్మ 3 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. రిష‌బ్ పంత్ 18 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే క్రీజులోకి వ‌చ్చిన శివం దూబేతో క‌లిసి సూర్య‌కుమార్ యాద‌వ్ భార‌త్ ను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. సూర్య కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 50 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. అలాగే, శివం దూబే 31 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భార‌త్ 18.2 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 111 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించింది. ఈ గెలుపుతో టీమిండియా సూప‌ర్ 8 కు అర్హ‌త సాధించింది.

 

 

విరాట్ కోహ్లీ గోల్డెన్ డ‌క్.. రోహిత్ శ‌ర్మ కూడా.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?