Latest Videos

T20 WC 2024 : భార‌త్ vs అమెరికా బిగ్ ఫైట్.. గెలిచిన జ‌ట్టు సూప‌ర్-8కు అర్హ‌త‌.. పిచ్ ఎలా ఉండ‌నుంది?

By Mahesh RajamoniFirst Published Jun 12, 2024, 9:48 AM IST
Highlights

United States vs India: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధ‌వారం భారత్-అమెరికా జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్ ల‌లో గెలిచి గ్రూప్ ఏ లో నాలుగేసి పాయింట్ల‌తో ఉన్నాయి. 
 

United States vs India : టీ-20 ప్రపంచకప్ 2024లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఫైట్ బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. టీ20 ప్రపంచ క‌ప్ 2024 లో భాగంగా 25వ మ్యాచ్ లో భార‌త్-అమెరికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8:00 PM IST కు ప్రారంభంకానుంది. రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో గెలుపు పై క‌న్నేశాయి. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి సూప‌ర్-8 లో బెర్తును నిలుపుకోవాల‌ని చూస్తున్నాయి.

ఇండియా-యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఓటమి కోసం పాకిస్థాన్ ప్రార్థిస్తోంది. ఎందుకంటే సూపర్-8కి అర్హత సాధించాలంటే పాకిస్థాన్ తన మిగిలిన ఒక మ్యాచ్‌లో గెలవాలి. ఇదే స‌మ‌యంలో అమెరికా తన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది, అప్పుడే పాకిస్థాన్ సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం పాక్ మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచింది. ఇక భారత జట్టు, అమెరికా జట్టు చెరో రెండు మ్యాచ్ ల‌ను గెలిచి నాలుగేసి పాయింట్ల‌తో సమంగా ఉన్నాయి.

న్యూయార్క్ గ్రౌండ్ పిచ్, వెద‌ర్ రిపోర్టులు ఏం చెబుతున్నాయి?

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇంత‌కుముందు జ‌రిగిన ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. అయితే, బుధ‌వారం జ‌రిగే టీమిండింయా-యూఎస్ఏ మ్యాచ్ స‌మ‌యంలో వ‌ర్షం కురిసే అవ‌కాశాలు లేవ‌వ‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. అమెరికాలో ఈ మ్యాచ్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది, దీని ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడ‌వ‌చ్చు.

నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ గురించి చెప్పాలంటే, పిచ్ కాస్తా స్లోగా ఉండ‌నుంది. కాబట్టి టాస్ గెలిస్తే భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయాల‌నుకుంటుంద‌ని స‌మాచారం. మ‌రోసారి ఈ పిచ్ పై బౌల‌ర్ల విశ్వ‌రూపం చూడ‌వ‌చ్చు. బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న ఈ పిచ్ లో ఏమైనా మార్పులు చేశారా లేదో చూడాలి.. !

ఇరు జ‌ట్ల ప్లేయింగ్ 11 అంచ‌నాలు

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

అమెరికా : స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవాల్కర్, అలీ ఖాన్.

T20 WORLD CUP 2024 : పాకిస్తాన్ గోల్డెన్ ఛాన్స్‌ను దెబ్బ‌కొట్టిన బాబర్ ఆజం-మ‌హ్మ‌ద్ రిజ్వాన్

click me!