Latest Videos

విరాట్ కోహ్లీ గోల్డెన్ డ‌క్.. రోహిత్ శ‌ర్మ కూడా..

By Mahesh RajamoniFirst Published Jun 12, 2024, 11:09 PM IST
Highlights

IND vs USA T20 World Cup 2024:  టీ20 వరల్డ్ కప్ 2024 25వ మ్యాచ్‌లో భారత్ - అమెరికా తలపడ్డాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో భార‌త ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మలు నిరాశ‌ప‌రిచారు.
 

IND vs USA T20 World Cup 2024: సూపర్ 8 కు ముందు టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా భారత్-అమెరికాలు కీల‌క మ్యాచ్ లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు నేరుగా సూప‌ర్ 8 కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జ‌ట్టును భార‌త బౌల‌ర్లు చెడుగుడు ఆడుకున్నారు. పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండా యూఎస్ బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్టారు. అమెరికా స్కోర్ బోర్డును 110 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. 111 ప‌రుగుల ఈజీ టార్గెట్ తో భార‌త్ ఛేజింగ్ ను ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు ప్రారంభించారు.

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేట్ 1 వికెట్ పడగొట్టారు. మిగతా బౌలర్లు కూడా పెద్దగా పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేశారు. 20 ఓవర్లలో అమెరికా 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. 111 పరుగుల విజయ లక్ష్యంతో టీం ఇండియా ఛేజింగ్ ను కొనసాగించింది. ఆరంభంలోనే భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ గోల్డెన్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ కు చేరాడు.

జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ ఆడుతూ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

బ్యాటింగ్‌లో భారత్‌కు తొలి ఓవర్‌లోనే తొలి దెబ్బ తగిలింది. సౌరభ్ నేత్రవల్కర్ తొలి ఓవర్ రెండో బంతికి వికెట్ కీపర్ ఆండ్రీస్ గౌస్ చేతికి క్యాచ్ రూపంలో కోహ్లీ చిక్కాడు. కోహ్లీ ఒక్క బంతి మాత్రమే ఆడగలిగాడు. దీంతో గోల్డెన్ డక్ బాధితుడు అయ్యాడు. భారత్ 1 ఓవర్లో 1 వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. ఇక మూడో ఓవర్లో సౌరభ్ నేత్రవాల్కర్ బౌలింగ్ లోనే భారత్‌కు రెండో దెబ్బ త‌గిలింది. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కూడా త్వ‌ర‌గానే ఔట్ అయ్యాడు. రోహిత్ 6 బంతుల్లో 3 పరుగులు చేసి హర్మీత్ సింగ్ చేతికి చిక్కాడు. యాదృచ్ఛికంగా, ముగ్గురు ఆటగాళ్లు ముంబైకి చెందినవారు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో భారత్ 3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.

 

1st Duck for Virat Kohli in T20WC 💔 pic.twitter.com/KEdqqhBIWJ

— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

అమెరికా: స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్ (కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవాల్కర్, అలీ ఖాన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్.

ఇండియాలో క్రికెట్..అమెరికాలో వ్యాపారం.. కొత్త ప్ర‌యాణంలో శుభ్‌మన్ గిల్

 

click me!