IND vs PAK మ్యాచ్ లో షాహీన్ అఫ్రిది vs రోహిత్ శర్మ బిగ్ ఫైట్ ను చూడాల్సిందే.. !

By Mahesh Rajamoni  |  First Published Jun 8, 2024, 11:47 PM IST

IND vs PAK : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భాగంగా  ఆదివారం న్యూయార్క్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ లు త‌ల‌ప‌డనున్నాయి. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ లో షాహీన్ అఫ్రిది, రోహిత్ శర్మల మధ్య పోరు ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
 


T20 World Cup 2024, IND vs PAK : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 లో మ‌రో హై వోల్టేజీ మ్యాచ్  కోసం క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అదే భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలుపు  కోసం ఇప్ప‌టికే ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు ముమ్మ‌రంగా క‌స‌రత్తులు చేస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్ల‌ ప‌లువురు ప్లేయ‌ర్లు మ‌ధ్య ఫైట్ త‌ప్ప‌కుండా చూడాల్సిందే. వారిలో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, పాకిస్తాన్ పేస‌ర్ షాహిన్ అఫ్రిది. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ 37 బంతుల్లో 52 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. జూన్ 9న న్యూయార్క్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగే భారత్ తదుపరి మ్యాచ్ లోనూ మ‌రోసారి తన బ్యాట్ ప‌వ‌ర్ ను చూపించాల‌నుకుంటున్నాడు.

పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది-భార‌త స్టార్ రోహిత్ శ‌ర్మ మ‌ధ్య గ‌త రికార్డులు గ‌మ‌నిస్తే.. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం రోహిత్ శర్మ రెండు టీ20 మ్యాచ్ ల‌లో ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి షాహిన్ అఫ్రిది చేతిలో ఔటయ్యాడు. 2021 టీ20 వరల్డ్ క‌ప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అఫ్రిది యార్కర్ తో రోహిత్ ను గోల్డెన్ డక్ తో ఔట్ చేశాడు.

Latest Videos

undefined

ఓ బాబర్ ఆజామూ.. నువ్వు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను చూసి నేర్చుకో.. !

లెఫ్టార్మ్ పేసర్లతో రోహిత్ ఇబ్బంది పడ్డాడా? గణాంకాలు గ‌మ‌నిస్తే ఇదే విషయాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. టీ20ల్లో రోహిత్ 73 ఇన్నింగ్స్ ల‌లో 21 సార్లు లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కానీ, వారి బౌలింగ్ లో 134.03 స్ట్రైక్ రేట్ తో 571 పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం పేసర్ల బౌలింగ్ లో రోహిత్ శ‌ర్మ ఔట్ కావ‌డం 14 సార్లు పవర్ ప్లే లోనే జ‌రిగాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లు రోహిత్ ను 13 ఇన్నింగ్స్ ల‌లో ఐదు సార్లు ఔట్ చేశారు. ఈ సంద‌ర్భంగా హిట్ మ్యాన్ స్ట్రైక్ రేటు 180గా ఉండ‌టం విశేషం.

ఇక టీ20ల్లో కొత్త బంతితో సంచలనం సృష్టిస్తున్న షాహీన్ అఫ్రిది టాప్ బ్యాట్స్ మెన్ ఇబ్బంది పెడుతున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. 63 పవర్ ప్లే ఇన్నింగ్స్ ల‌లో 6.93 ఎకానమీతో 36 వికెట్లు పడగొట్టాడు. 2019 నుంచి షాహీన్ అఫ్రిది 34 పవర్ ప్లే వికెట్లతో టీ20ల్లో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ (39) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే స‌మ‌యంలో 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ శర్మ 16 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేసి భారత్ ట్రోఫీని గెలుకోవ‌డంలో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ల్లో పాకిస్థాన్ పై అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 30 ప‌రుగులు. పాకిస్థాన్ పై ఇతర టీ20 స్కోర్లు 2, 4, 24*, 0, 10, 0, 12, 28, 4. ఇక భారత్ తో జరిగిన రెండు టీ20ల్లో షాహిన్ అఫ్రిది 8.12 ఎకానమీ రేట్ తో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు జూన్ 9న టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో మ‌రోసారి భార‌త్-పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నాయి.

IND vs PAK : భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్క‌డ లైవ్ ఉచితంగా చూడ‌వ‌చ్చు?

click me!