INDvsPAK - Virat Kohli: జూన్ 9న టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్-పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో భారత్ దే పైచేయి. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పై ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
INDvsPAK - Virat Kohli : భారత్-పాకిస్తాన్ సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 9న టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్-పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో భారత్ దే పైచేయి. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి పాక్ తనదైన బ్యాటింగ్ తో బిగ్ షాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కింగ్ కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తూ అతని బ్యాట్ నుంచి మరో మంచి ఇన్నింగ్స్ ను చూడబోతున్నామని పేర్కొన్నాడు.
2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. పాకిస్థాన్ తో గత టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో కోహ్లీ ఐదు మ్యాచ్ ల్లో 308 పరుగులు చేశాడు. 308.00 సగటు, 132.75 స్ట్రైక్ రేట్ తో పరుగుల వరద పారించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇందులో కోహ్లీ అత్యధిక స్కోరు 82* పరుగులు. ఏఎన్ఐతో మాట్లాడిన కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ.. కోహ్లీ బలమైన స్వభావం, ఎలాంటి ఆట పరిస్థితులకైనా అలవాటు పడగల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ.. ఈ స్టార్ ప్లేయర్ పాక్ తో ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోచ్ సూచించాడు.
undefined
'విరాట్ బ్యాటర్లకు రారాజు.. రన్ మెషిన్ గా పేరుగాంచిన అతని బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. ఆయనది మంచి మనస్తత్వం. ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడేలా అతని అడాప్టబిలిటీ ఉంటుంది. అతను తన బాధ్యతలను అర్థం చేసుకుంటాడు..ఇలాంటి క్లిష్టమైన వికెట్లలో అతను ఆడేటప్పుడు మరింత దృష్టితో ఉంటాడు. ఎందుకంటే అతని వికెట్ ఉండాల్సిన అవసరం ఉందని అతనికి తెలుసు.. అతని వద్ద ఉన్న టెక్నిక్ తో కోహ్లీ ఓపెనింగ్ చేయాలి" అని రాజ్ కుమార్ అన్నాడు.
AUS VS ENG T20 WC: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు ఆస్ట్రేలియా బిగ్ షాక్..
అలాగే, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి రాజ్ కుమార్ స్పందిస్తూ.. ఇది సూటిగా జరిగే మ్యాచ్ కాదని వ్యాఖ్యానించాడు. సంయమనం, పట్టుదలను కాపాడుకోగలిగిన జట్టు ఆదివారం విజయం సాధిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఒత్తిడిని ఏ టీమ్ జయిస్తుందో వారికి విజయం దక్కుతుందని పేర్కొన్నాడు. 'పాకిస్థాన్ తో మ్యాచ్ అంత సులువు కాదు. ఇది ఎల్లప్పుడూ ఒత్తిడితో కూడిన ఆట. ఒత్తిడిని తట్టుకునే జట్టు గెలుస్తుంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే భారత్ చాలా మెరుగ్గా ఉందని చెప్పవచ్చు కానీ పాకిస్తాన్ ను ఎప్పుడూ తేలికగా తీసుకోలేం ఎందుకంటే వారు కూడా మనపై ఎప్పుడు మెరుగైన ప్రదర్శన చేయడానికి ముందుంటారు. ఎవరి చేతిలోనైనా ఓడిపోవాలన్న ఉద్దేశంతో వారు ఆడినా మన భారత అభిమానులు భావించినట్లు భారత్ చేతిలో ఓడిపోరు' అని అన్నాడు.
కాగా, ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ గత మ్యాచ్ లో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం చవిచూసి కాస్త ఒత్తిడిలో భారత్ తో మ్యాచ్ ఆడనుంది. అయితే, ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లలో పాకిస్తాన్ పై భారత్ దే పైచేయిగా ఉంది.