T20 World Cup 2024, IND vs IRE: ఆరంభం అదిరిపోయేలా ప్రారంభించింది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్ ను చిత్తుచేసి టీ20 ప్రపంచ కప్ 2024 లో విజయంతో తన ప్రయాణం ప్రారంభించింది. అయితే, రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
IND vs IRE : టీ20 వరల్డ్ కప్ 2024 లో ఈ ఐర్లాండ్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో భారత పేసర్లు అద్భుత బౌలింగ్ చేసి ఐర్లాండ్ ను 100 పరుగులలోపే కట్టడి చేశారు. బ్యాటింగ్ లోనూ అదరగొట్టారు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఈ మెగా టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్ జట్టును 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు.. 97 పరుగుల టార్గెట్ ను 12.2 ఓవర్లలోనే అందుకుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. రిటైర్ హార్ట్ గా వెనుదిరిగి హిట్ మ్యాన్ తన 52 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించిన రోహిత్ శర్మకు సంబంధించిన నవ్వులుపూయించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఏంది సామి నువ్వు మళ్లీ ఎవరెవరు ఆడుతున్నారో మర్చిపోయావా? అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గతంలో తన యాక్సెసరీలు, కీలక పత్రాలు, పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జట్టు హోటళ్లు, డ్రెస్సింగ్ రూమ్స్ తదితర ప్రదేశాల్లో మర్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మెన్ ఇన్ బ్లూ కెప్టెన్ ఇలా మర్చిపోవడం సాధారణమేనని అతని సహచరులు, స్నేహితులు పలుమార్లు కూడా పేర్కొన్నారు.
undefined
IND vs IRE : హార్దిక్ పాండ్యా దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్లు ..
ఇదే విధంగా న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ టాస్ వేయడంతో రోహిత్ 'హెడ్స్' అని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడుతూ.. ఇదే వేదికపై బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ ను ప్రస్తావిస్తూ తాను, మేనేజ్ మెంట్ తమ వ్యూహం నుంచి స్ఫూర్తి పొందామనీ, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కంటే ఛేజింగ్ కు ప్రాధాన్యమిచ్చే విధానాన్ని అనుసరించామని రోహిత్ తెలిపాడు. ఈ క్రమంలోనే భారత జట్టు కూర్పు గురించి బ్రాడ్కాస్టర్ అడగ్గా.. సరదా సంఘటన చోటుచేసుకుంది. టీ20 ప్రపంచ కప్ జట్టులోని ప్లేయర్లలలో తుది జట్టులోని చోటుదక్కని వారి గురించి ప్రస్తావిస్తూ.. ఆటగాళ్లు ఎవరనేది మర్చిపోయాడు. రోహిత్ శర్మ తనదైన శైలిలో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్ పేర్లను చెబుతూ.. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను మర్చిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
Rohit Sharma forgets again about the players who are missing out 😃 pic.twitter.com/0J4mluPpui
— SRHFans (@SRHFans4ever)
టీ20 ప్రపంచ కప్ 2024లో భారత స్టార్ పేసర్ చెత్త రికార్డు..