IND vs IRE: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో భారత బౌలర్ల విధ్వంసం.. రికార్డుల మోత

By Mahesh Rajamoni  |  First Published Jun 5, 2024, 11:42 PM IST

T20 World Cup 2024, IND vs IRE: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లో ఐర్లాండ్ తో జ‌రిగిన త‌మ తొలిమ్యాచ్ లో భార‌త బౌలర్లు విధ్వంసం సృష్టించారు. సూప‌ర్ బౌలింగ్ తో ఐర్లాండ్ ప్లేయర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ  వరుస రికార్డులు సృష్టించారు. 
 


T20 World Cup 2024, IND vs IRE:  ఐర్లాండ్ పై సూప‌ర్ విక్ట‌రీతో టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఐర్లాండ్ జట్టును 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా విమ‌ర్శ‌కుల నోళ్ళు మూయిస్తూ అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శన చేసి 3 కీల‌క‌మైన‌ వికెట్లు తీశాడు. అలాగే, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. వీరికి తోడుగా మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

భారత ఫాస్ట్ బౌలర్లకు మ‌రో రికార్డు.. 

Latest Videos

undefined

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు టీ20 ప్రపంచకప్‌లో 8 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇది మూడోసారి. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ మినహా మిగిలిన 8 వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే దక్కాయి. చివ‌ర‌లో ఒక ప్లేయ‌ర్ రనౌట్ అయ్యాడు. అంతకుముందు 2007లో జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌పై 9 వికెట్లు పడగొట్టారు. 2022లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఫాస్ట్ బౌలర్లు 8 వికెట్లు తీశారు.

బుమ్రాను అధిగ‌మించిన అర్ష్‌దీప్ సింగ్.. 

ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీశాడు. ఇది ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌. తొలి బంతికే పాల్ స్టెర్లింగ్‌కి రిషబ్ పంత్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. చివరి బంతికి ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ అర్ష్ దీప్. భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్ గా జస్ప్రీత్ బుమ్రాను అధిగ‌మించి రికార్డు సృష్టించాడు. బుమ్రా 25 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అర్ష్‌దీప్‌ 26 వికెట్లు తీశాడు. పవర్‌ప్లేలో భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 47 వికెట్లు పడగొట్టాడు.

అక్షర్ పటేల్ మ‌రో రికార్డు

ఈ మ్యాచ్‌లో బారీ మెక్‌కార్తీ వికెట్‌ను అక్షర్ పటేల్ తీశాడు. త‌న బౌలింగ్ లోనే బ్యాట‌ర్ ఇచ్చిన క్యాచ్ ను అద్భుతంగా ఒంటిచేత్తో అందుకున్నాడు. అక్షర్ భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో 50 వికెట్లు పూర్తి చేశాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా ఘ‌న‌త సాధించాడు.

 

Impressive & effective! 👌👌's clinical bowling display in numbers 🔢👏👏 | pic.twitter.com/Zag2z0bU50

— BCCI (@BCCI)

 

IND VS IRE : రోహిత్ శ‌ర్మ ధ‌నాధ‌న్ బ్యాటింగ్.. అద‌ర‌గొట్టిన బౌల‌ర్లు.. ఐర్లాండ్ పై భార‌త్ గెలుపు

click me!