IND vs IRE : టీ20 వరల్డ్ కప్ 2024 లో ఈ ఐర్లాండ్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో భారత పేసర్లు బాగా బౌలింగ్ చేశారు. అందులోనూ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ, టీ20 ప్రపంచకప్ లో చెత్త రికార్డును నమోదుచేశాడు.
T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా భారత్ విజయంతో మెగా టోర్నీలో తన ప్రయాణం మొదలు పెట్టింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ తో భారత్ తలపడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు భారత బౌలర్లు బిగ్ షాకిచ్చారు. అద్భుత డెలివరీలు వేస్తూ ఐర్లాండ్ ప్లేయర్లను ఇబ్బందులు పెట్టడంతో వారు పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. భారత్ ఐర్లాండ్ జట్టును 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ చేసి.. 12.2 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుని ఈ ప్రపంచ కప్ లో తొలి విజయాన్ని నమోదుచేసింది.
అయితే, ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు పలు రికార్డులు బద్దలు కొట్టారు. హార్దిక్ పాండ్యా సూపర్ బౌలింగ్ తో 3 వికెట్లు తీశాడు. అలాగే, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. వీరికి తోడుగా మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ తొలి బంతికే పాల్ స్టెర్లింగ్ ను పెవిలియన్ కు పంపిన అర్ష్‌దీప్ సింగ్, చివరి బంతికి ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా జస్ప్రీత్ బుమ్రాను అధిగమించాడు. బుమ్రా 25 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, అర్ష్‌దీప్ 26 వికెట్లతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ 47 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.
undefined
ఈ క్రమంలోనే అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డును కూడా నమోదుచేశాడు. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్‌లో డెలివరీల పరంగా ఒక భారత క్రికెటర్ వేసిన పొడవైన ఓవర్ ను నమోదుచేశాడు. భారత జట్టు ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌లో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 10 బంతుల సుదీర్ఘ ఓవర్‌ని వేశాడు. ఈ ఓవర్లో అర్షదీప్ 13 పరుగులు ఇచ్చాడు. 2016 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌పై తొమ్మిది బంతుల ఓవర్ వేసిన రవీంద్ర జడేజాను అధిగమించి చెత్త రికార్డును తనపేరుతో లిఖించుకున్నాడు.
IND VS IRE: టీ20 ప్రపంచ కప్ 2024లో భారత బౌలర్ల విధ్వంసం.. రికార్డుల మోత